ఎన్టీఆర్.. రెండున్నర కోట్ల వాచీ

సెలబ్రిటీలు బయటకు వస్తే వాళ్ల షూస్, డ్రెస్, వాచ్ ఇవన్నీ వార్తల్లోకి వచ్చేస్తాయి. వాటి మోడల్, వాటి బ్రాండ్ అన్నీ బయటకు తీస్తారు. నెట్ ను కెలికేస్తారు.. మొత్తానికి డిటైల్స్ బయటకు తీస్తారు. అది…

సెలబ్రిటీలు బయటకు వస్తే వాళ్ల షూస్, డ్రెస్, వాచ్ ఇవన్నీ వార్తల్లోకి వచ్చేస్తాయి. వాటి మోడల్, వాటి బ్రాండ్ అన్నీ బయటకు తీస్తారు. నెట్ ను కెలికేస్తారు.. మొత్తానికి డిటైల్స్ బయటకు తీస్తారు. అది అంబానీ అయినా మరెవరు అయినా కూడా.

లేటెస్ట్ గా ఎన్టీఆర్ ధరించిన వాచీ వార్తల్లోకి వచ్చింది. నిన్నటికి నిన్న జ‌రిగిన ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి. వాటిల్లో ఎన్టీఆర్ వాచ్ ఒకటి. ఈ వాచీ ఖరీదు సుమారు 2.5 కోట్లు అంట. రెండున్నర కోట్ల వాచీ చేతికి ధరించడం అంటే మామూలు విషయం కాదు.

Patek Philippe అనే కంపెనీ వాచీ ఇది. ఇక దీని వివరాలు ఇక్కడ చెప్పడం కంటే ఆన్ లైన్ లో సెర్చ్ చేసేసుకుంటే బోలెడు సంగతులు తెలుస్తాయి. అమెరికాలో దీని రేటు సుమారుగా మూడు లక్షల డాలర్లు అంట. మరి ఇండియాకు వచ్చేసరికి లేదా ఇండియాలో కొనాలంటే అదనపు పన్నులు వుండనే వుంటాయి.

ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. పుట్టుకతో వందల కోట్ల ఆస్తులు వారసత్వంగా వచ్చిన హీరో కాదు. స్వయం కృషితో ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు దేవర సినిమా కనుక పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయితే ఇలాంటి వాచీలు జ‌స్ట్.. జు.. జు.. బీ.

15 Replies to “ఎన్టీఆర్.. రెండున్నర కోట్ల వాచీ”

  1. “ఈ వాచీ ఖరీదు సుమారు 2.5 కోట్లు అంట. రెండున్నర కోట్ల వాచీ చేతికి ధరించడం అంటే మామూలు విషయం కాదు”

    అవునా? దానిని వేలం వేస్తే 25 లxక్షలకు మించి ఎవరూ కొనరు. ఏదో King Edward ధరించినట్లు hype ఒకటి.

  2. మా అన్న 🚽 కాస్ట్ 25 లక్షలు, మేము ఎవరికైనా చెప్పుకున్నావా ఏంటి.

Comments are closed.