ఓ మై కడవలే..ఓరి దేవుడా

కరోనా టైమ్ కు ముందుగా తమిళంలో వచ్చి మంచి అప్లాజ్ అందుకున్న సినిమా ఓ మై కడవలే. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులోకి తెస్తున్నారు నిర్మాత పివిపి. Advertisement విష్వక్ సేన్ కథానాయకుడిగా తయారవుతున్న…

కరోనా టైమ్ కు ముందుగా తమిళంలో వచ్చి మంచి అప్లాజ్ అందుకున్న సినిమా ఓ మై కడవలే. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులోకి తెస్తున్నారు నిర్మాత పివిపి.

విష్వక్ సేన్ కథానాయకుడిగా తయారవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేసారు. ఓరి దేవుడా అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. 

యూత్ ఫుల్ ఫ్యామిలీ రొమాంటిక్ అనేలా అన్ని జానర్ లను టచ్ చేసే కథతో తయారైన సినిమా ఇది. పైగా ఇందులో 'దేవుడు' క్యారెక్టర్ స్పెషల్. తమిళ్ లో ఈ పాత్రను విజయ్ సేతుపతి చేసారు. తెలుగులో ఎవరు చేస్తారో ఇంకా తెలియదు.

హీరోగా విష్వక్ సేన్ కు జంటగా మిథిల పాల్కర్, ఆశా భట్ నటిస్తున్నారు. తమిళ సినిమాను డైరక్ట్ చేసిన అశ్వథ్ మరిమత్తు నే తెలుగు సినిమా కూడా టేకప్ చేసారు. సినిమా ఫస్ట్ లుక్ క్రేజీగా ఇంట్రస్టింగ్ గా వుంది.