పాన్ ఇండియా రౌడీ ‘వారియర్’

పాన్ ఇండియా సినిమాలు చూసి వుంటారు. పాన్ ఇండియా రౌడీలను చూసారా? Advertisement వెతుక్కుంటూ వచ్చిన వాడిని కొట్టడం కాదు..వెదుక్కుంటూ వెళ్లి కొట్టడం గ్యాంగ్ స్టార్స్ వీలైతే మారిపోండి..లేదంటే పారిపోండి ఇవీ రామ్ పోతినేని-…

పాన్ ఇండియా సినిమాలు చూసి వుంటారు. పాన్ ఇండియా రౌడీలను చూసారా?

వెతుక్కుంటూ వచ్చిన వాడిని కొట్టడం కాదు..వెదుక్కుంటూ వెళ్లి కొట్టడం

గ్యాంగ్ స్టార్స్ వీలైతే మారిపోండి..లేదంటే పారిపోండి

ఇవీ రామ్ పోతినేని- లింగుస్వామి కాంబినేషన్ లో తయారవుతున్న వారియర్ టీజర్ లో పడిన డైలాగులు. వన్ అండ్ హాఫ్ మినిట్ వున్న టీజర్, అందులో పడిన సీన్లు, వేసిన డైలాగులు చెబుతున్నాయి సినిమా ఏ రేంజ్ మాస్ లో వుండబోతోందో. 

తమిళ డైరక్టర్ లింగుస్వామి అంటే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అతగాడు చేస్తున్న తొలి తెలుగు సినిమా. టీజర్ మొత్తం లింగుస్వామి స్టయిల్ కనిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ డీఎస్పీ సత్యగా రామ్ స్టయిలిష్ గా కనిపించాడు. అతన్ని ఢీకొనే విలన్ గా ఆది  పినిశెట్టి కూడా గట్టిగానే కనిపించాడు. టీజర్ మొత్తం భారీ యాక్షన్ సీన్లు, విలన్, హీరోయిన్ పరిచయం..అంతే. 

ట్రయిలర్ వస్తే కథ లైనూ లెంగ్తూ తెలుస్తాయి.  చిట్టూరి శ్రీను నిర్మించే ఈ సినిమాకు సంగీతం దేవీ శ్రీ ప్రసాద్..