Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాజుగారి గది 3లో తమన్నా

రాజుగారి గది 3లో తమన్నా

రాజుగారి గది, రాజుగారి గది 2 రెండూ కమర్షియల్ గా మంచి హిట్ లు అయ్యాయి. ఇప్పుడు మూడోపార్ట్ కు రంగం సిద్దమయింది. లారెన్స్ కాంచన సిరీస్ మాదిరిగా దర్శకుడు ఓంకార్ రాజుగారి గది సిరీస్ ను పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రాజుగారి గది 3లో హీరోయిన్ తమన్నా నటిస్తోంది.

సినిమా అంతా తమన్నా చుట్టూనే తిరుగుతుంది. పార్ట్ 2లో నాగ్-సమంత కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. పార్ట్ 3లో దర్శకుడు ఓంకార్ సోదరుడు అశ్విన్ హీరోగా కనిపిస్తాడు. ఓంకార్ సినిమాలు అన్నింటిలో అశ్విన్ కు కీలకపాత్ర వుంటుందన్న సంగతి తెలిసిందే.

రాజుగారి గది 3ను దర్శకుడు ఓంకార్ నే తన స్వంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈరోజే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. వీలయినంత ఫాస్ట్ గా నిర్మాణం పూర్తిచేసి విడుదల చేస్తారు.

ప్రయత్నాలు ఆపని అఖిలప్రియ.. మరి జగన్ కరుణిస్తాడా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?