అప్పటికీ ఇప్పటికీ అదే తేడా

పెళ్లికి ముందు జాకీ తనకు ఎలా అనిపించాడో, పెళ్లి తర్వాత కూడా అలానే అనిపిస్తున్నాడని వెల్లడించింది రకుల్.

ఇన్నేళ్లూ ఒకెత్తు, రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ ఒక్క ఏడాది మరో ఎత్తు. ఎందుకంటే, ఈ ఏడాది ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. జాకీ భగ్నానీతో కలిసి జీవితాన్ని పంచుకుంటోంది. మరి ఈ ఏడాదిలో వ్యక్తిగతంగా ఏమైనా మార్పులొచ్చాయా?

వీటిపై రకుల్ ప్రీత్ నిజాయితీగా స్పందించింది. పెళ్లికి ముందు జాకీని ఆకట్టుకోవడానికి ప్రయత్నించానని, ఇప్పుడా అవసరం లేదని అంటోంది. ఇక పెళ్లికి ముందు కేవలం డేటింగ్స్ కోసం మాత్రమే కలిసేవాళ్లమని, కానీ ఇప్పుడు రాత్రి-పగలు కలిసి ఉంటున్నామని, అర్థం చేసుకోవడానికి మరింత అవకాశం దొరికిందని చెబుతోంది.

పెళ్లికి ముందు జాకీ తనకు ఎలా అనిపించాడో, పెళ్లి తర్వాత కూడా అలానే అనిపిస్తున్నాడని వెల్లడించింది రకుల్. డేటింగ్ చేస్తున్నప్పుడే జాకీ ఎంటో, అతడి మనసేంటో పూర్తిగా తనకు అర్థమైందని, కాబట్టి పెళ్లి తర్వాత కొత్త ఫీలింగ్ ఏం రాలేదని చెబుతోంది.

ఎలా ఉంటున్నాం, ఎలాంటి దుస్తులు ధరిస్తున్నామనే విషయంపై పెళ్లి తర్వాత తామిద్దరం పట్టించుకోవడం మానేశామని, అయితే మీడియా దృష్టి ఉంటుంది కాబట్టి బయటకెళ్లేటప్పడు చర్చించుకొని దుస్తులు ధరిస్తున్నామని వెల్లడించింది. ఒక వ్యక్తిగా చాలా సురక్షితంగా ఉన్నానని, లైఫ్ ఇలా సాగిపోతే చాలని అంటోంది.

One Reply to “అప్పటికీ ఇప్పటికీ అదే తేడా”

Comments are closed.