Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఒక్క నిమిషంలో.. అన్ని వేరియేషన్స్ చూపించాడు

ఒక్క నిమిషంలో.. అన్ని వేరియేషన్స్ చూపించాడు

ప్రేయసితో రొమాంటిక్ గా ఉంటాడు. ఊరి ప్రజలతో ప్రేమగా ఉంటాడు. విలన్ పాలిట యమకింకరుడిగా మారతాడు. అందరికీ అన్నం పెట్టి ఆప్తుడవుతాడు. కాడె మోసిన చేతులతోనే కత్తి పట్టి సంహరిస్తాడు. ఇలా రామ్ చరణ్ లోని వేరియేషన్స్ అన్నింటినీ జస్ట్ ఒక్క నిమిషంలో చూపించింది ఆచార్య టీజర్.

ఆచార్య సినిమాకు సంబంధించి ఈరోజు రామ్ చరణ్ క్యారెక్టర్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్ర పోషిస్తున్నాడు చరణ్. ఆ పాత్ర లుక్ ఎలా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడా పాత్ర స్వభావం ఏంటనే విషయాన్ని ఈరోజు రిలీజ్ చేసిన టీజర్ లో చూపించారు.

రామ్ చరణ్ లోని సాఫ్ట్ అండ్ యాంగ్రీ లుక్స్ ను ఈ టీజర్ లో ప్రజెంట్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. టీజర్ చివర్లో చిరంజీవిని కూడా చూపించి కొసమెరుపు ఇచ్చారు మేకర్స్. టీజర్ కు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ఆచార్య సినిమాకు సంబంధించి చిరంజీవి టీజర్ ఇప్పటికే రిలీజైంది. ఇప్పుడు రామ్ చరణ్ టీజర్ కూడా వచ్చేసింది. దీంతో సినిమాలో రెండు ప్రధాన పాత్రలకు సంబంధించిన టీజర్లు రిలీజ్ అయినట్టయింది.

నిజానికి ఆచార్య సినిమాకు సంబంధించి ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు టీజర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ సాంగ్స్ తో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో బజ్ రావడం లేదు. అందుకే ఇలా టీజర్ ప్లాన్ చేసినట్టున్నారు.

కొణెదల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై వస్తోంది ఆచార్య మూవీ. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ గా కనిపించబోతున్నాడు. కొరటాల శివ దర్శకుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?