రీ షూట్ చేస్తే తప్పేంటీ…బెటర్ మెంట్ నే కదా అన్నది దర్శకుడు కొరటాల పాయింట్. నిజమే..కరెక్టే . కానీ అలాంటివేం చేయలేదు అని చెప్పడమే అనుమానంగా వుంది.
ఎందుకంటే కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్ నాటికే విడుదలకు రెడీ అయిపోయింది. కానీ మరి ఇప్పటి వరకు పోస్ట్ ప్రొడక్షన్ ఎందుకు కాలేదు?
ఈ నెల 22 వరకు ఫస్ట్ కాపీ రెడీ కాదు అని సమాచారం. సెన్సారు కూడా 22న కానీ ఆ తరువాత కానీ జరుగుతుందని తెలుస్తోంది. డిఐ వర్క్ జరుగుతోంది. మరి గత మూడు నాలుగు నెలలుగా ఏం జరిగినట్లు? కొరటాల గత సినిమాల్లో హీరోల జోక్యం చాలా నామినల్.
కానీ ఈ సినిమాలో మెగా జోక్యం, బెటర్మెంట్ ఎక్కువయ్యాయని చాలా గ్యాసిప్ లు వున్నాయి. ఒక దశలో ఈ సినిమాను బయటకు వదిలేస్తే చాలు అని నిర్మాత, దర్శకులు ఫీలయ్యారు అనేంత వదంతులు వున్నాయి.
మొత్తం మీద కొరటాల ఇప్పటికి ఫ్రీ అవుతున్నారు. మరో పది రోజులయితే ఆయన మీద నుంచి ఆచార్య భారం దిగిపోతుంది. ఎన్టీఆర్ సినిమా మీదకు వెళ్లిపోతారు. ఎన్టీఆర్ దగ్గర మాత్రం ఆయనకు వర్క్ కేక్ వాక్ నే.