దొడ్డిదారిన మంత్రులను చేసిన బాబు

ఆయన పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ఏకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎదిగారు. దీని వెనక ఆయన కృషి, చిత్తశుద్ధి ఉన్నాయి. ఆయనే అనకాపల్లి జిల్లాకు చెందిన కొత్త ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు.…

ఆయన పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ఏకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎదిగారు. దీని వెనక ఆయన కృషి, చిత్తశుద్ధి ఉన్నాయి. ఆయనే అనకాపల్లి జిల్లాకు చెందిన కొత్త ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు. ఆయన రెండు దఫాలుగా మాడుగుల నుంచి గెలిచారు. టీడీపీ వల వేసినా లొంగని ఆయన నిజాయతీకి జగన్ ఇచ్చిన బహుమానమే ఈ పదవి.

ఇదిలా ఉంటే బూడి మంత్రిగా జిల్లాకు వస్తూనే తొలి బాణాన్ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీద వేశారు. అయ్యన్నకు మతిభ్రమించింది అనేశారు. ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని కూడా బూడి పోల్చి చెప్పారు. అధికారంలోకి వస్తామని తెలుగుదేశం నాయకులు పగటి కలలు కంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు కొత్త మంత్రి.

నీరు-మీరు, జన్మభూమి కమిటీల పేరిట గత టీడీపీ సర్కార్ ఎలా దోచుకుందో జనాలందరికీ తెలుసని బూడి సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులనే మంత్రులుగా చేశారని, బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారని ముత్యాలనాయుడు గుర్తు చేశారు.

గత టీడీపీ సర్కార్ లో ఎమ్మెల్యేలుగా కూడా గెలవని వారిని దొడ్డిదారిన తెచ్చి మంత్రులను చేశారని చంద్రబాబు మీద ఆయన కుమారుడు లోకేష్ మీద కూడా ఇండైరెక్ట్ గా పదునైన విమర్శలే చేశారు బూడి. మొత్తానికి అయ్యన్నపాత్రుడు పొరుగు నియోజకవర్గానికే ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. 

ఇక తన పొలిటికల్ టార్గెట్ ఎవరో డిసైడ్ చేసుకున్న బూడి అయ్యన్నను కార్నర్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అయ్యన్న విమర్శలకు సరైన జవాబు అధికార పార్టీ నుంచి లేదు. ఆ లోటుని ఉప ముఖ్యమంత్రి తీరుస్తారని అంటున్నారు. సో అనకాపల్లి కొత్త జిల్లాలో సరికొత్త రాజకీయాన్ని ఇక మీదట చూడవచ్చు అన్న మాట.