‘చిరు’-చరణ్ ల పాటొచ్చింది

ఎప్పుడో మగధీరలో తండ్రీ కొడుకులు ఇద్దరూ ఓ పాటలో తళుక్కున మెరిసారు. ఆ తరువాత మరోసారి బ్రూస్ లీ లో ఇద్దరూ కలిసి ఓ ఫ్రేమ్ లో జిగేల్ మన్నారు. కానీ చిరు..చరణ్ కలిసి…

ఎప్పుడో మగధీరలో తండ్రీ కొడుకులు ఇద్దరూ ఓ పాటలో తళుక్కున మెరిసారు. ఆ తరువాత మరోసారి బ్రూస్ లీ లో ఇద్దరూ కలిసి ఓ ఫ్రేమ్ లో జిగేల్ మన్నారు. కానీ చిరు..చరణ్ కలిసి చేసిన తొలి సినిమా ఆచార్య నే. ఈ సినిమాలో ఇద్దరి మీద చిత్రీకరించిన 'బంజారా..బంజారా'పాట ను విడుదల చేసారు.

ఎప్పటి లాగే ఈ పాటను కూడా రామజోగయ్య శాస్త్రి మంచి భావంతో అందించారు. చీకటికి చిల్లుపడి వెన్నెల అలుముకోవడం అన్న అవుటాఫ్ ది బాక్స్ అయిడియాలు మరి కొన్ని వున్నాయి. అడవితల్లి కాచే బిడ్డలు, వారే ఆమె ఆయుధాలు అన్న లైన్లు కూడా బాగున్నాయి. 

శేఖర్ మాస్టర్ చిరు..చరణ్ లకు పక్కాగా మ్యాచ్ అయ్యే స్టెప్స్ ను బాగానే కంపోజ్ చేసారు. ముఖ్యంగా మెగాస్టార్ స్టయిల్ ను, ఫార్మాట్ ను దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేసారు. పిక్చరైజేషన్ బాగుంది. కానీ మణిశర్మ ఇంకా ఆయన ఓల్డ్ స్టయిల్ లోనే పాటలు చేస్తున్నారు. 

పూరి ఇస్మార్ట్ శంకర్ కు ఆయన చేసిన ట్యూన్ లు చూసి, డజనుకు పైగా సినిమాలు ఆయన చేతిలోకి వచ్చాయి. కానీ మళ్లీ ఆ రేంజ్ ట్యూన్ లు, ఆ రేంజ్ కొత్తదనం మాత్రం కనిపించడం లేదు. బట్ చిరు సినిమా పాట కాబట్టి బాగానే రీచ్ వుంటుంది.