శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంప‌తుల‌పై రివ‌ర్స్ అటాక్‌!

సీనియ‌ర్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భ‌ర్త రాజ్‌కుంద్రాల‌పై ప్ర‌ముఖ మోడ‌ల్‌, న‌టి షెర్లిన్ చోప్రా రివ‌ర్స్ అటాక్ చేశారు. ఫోర్న్ కేసులో రాజ్‌కుంద్రా పీక‌ల్లోతు ఇరుక్కున్న సంగ‌తి తెలిసిందే. రాజ్‌కుంద్రా జైలు జీవితాన్ని గ‌డిపి…

సీనియ‌ర్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భ‌ర్త రాజ్‌కుంద్రాల‌పై ప్ర‌ముఖ మోడ‌ల్‌, న‌టి షెర్లిన్ చోప్రా రివ‌ర్స్ అటాక్ చేశారు. ఫోర్న్ కేసులో రాజ్‌కుంద్రా పీక‌ల్లోతు ఇరుక్కున్న సంగ‌తి తెలిసిందే. రాజ్‌కుంద్రా జైలు జీవితాన్ని గ‌డిపి వ‌చ్చారు. న‌టి షెర్లిన్ త‌మ ప‌రువుకు న‌ష్టం క‌లిగించేలా ఆరోప‌ణ‌లు చేశారంటూ శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంప‌తులు ఆమెపై రూ.50 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో షెర్లిన్ రివ‌ర్స్‌లో శిల్పా దంప‌తుల‌పై ఎదురు దాడికి దిగారు. తనను మానసికంగా వేధించినందుకు గాను రూ.75కోట్లు అడుగుతూ తానే తిరిగి వాళ్లకు నోటీసులు పంపానని షెర్లిన్‌ వెల్లడించారు. వీరి ప‌రువు న‌ష్టం దావాల‌పై బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

రాజ్‌కుంద్రా త‌న‌ను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ గ‌త ఏప్రిల్‌లో షెర్లిన్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదైంది. ఇటీవ‌ల ఇదే విష‌య‌మై మ‌రోసారి ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తూ ప‌రువు న‌ష్టం క‌లిగిస్తోంద‌ని రాజ్‌కుంద్రాతో పాటు శిల్పాశెట్టి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు షెర్లిన్‌పై న్యాయ‌పోరాటానికి దిగారు.

ఇదే సంద‌ర్భంలో తానేం త‌క్కువ తిన‌లేద‌న్న చందంగా…షెర్లిన్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రా తనను అండర్‌ వరల్డ్‌తో బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇప్పుడు పరువునష్టం నోటీసులు కూడా ఇచ్చారని, కానీ ఇలాంటివాటికి తాను భయపడన‌న్నారు. 

తనను మానసికంగా వేధించినందుకు గాను రూ.75కోట్లు న‌ష్టం ప‌రిహారం చెల్లించాల‌ని నోటీసులు పంపిన‌ట్టు వెల్లడించారు. అలాగే రాజ్‌కుంద్రాపై చేసిన ఫిర్యాదుపై విచారణకు తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నట్టు షెర్లిన్‌ తెలిపారు.