మా ఆయన బంగారం: రెహ్మాన్ భార్య

29 ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఏఆర్ రెహ్మాన్, తన భార్య సైరా బానుతో విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే అతడి కంటే ముందే సైరా ఆ ప్రకటన చేశారు. Advertisement ఈ…

29 ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఏఆర్ రెహ్మాన్, తన భార్య సైరా బానుతో విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే అతడి కంటే ముందే సైరా ఆ ప్రకటన చేశారు.

ఈ ప్రకటన బయటకొచ్చిన తర్వాత రెహ్మాన్ పేరు ఇంటర్నెట్ లో మార్మోగిపోయింది. అతడిపై ఎన్నో కథనాలొచ్చాయి. తప్పంతా రెహ్మాన్ దే అన్నట్టు విశ్లేషణలు పుట్టుకొచ్చాయి. వీటన్నింటినీ సైరా బాను ఖండించారు. భర్తకు మద్దతుగా ఆమె ప్రకటన చేశారు.

“తమిళ మీడియాకు, యూట్యూబ్ కు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి రెహ్మాన్ పై వ్యతిరేక కథనాలు ఆపండి. ఈ ప్రపంచంలోనే చాలా మంచి వ్యక్తి అతను. నేను ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఆయన కూడా అంతే.”

కొన్ని నెలలుగా తన ఆరోగ్యం బాగాలేదని, అందుకే రెహ్మాన్ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు సైరా బాను. ప్రస్తుతం తను ముంబయిలో చికిత్స తీసుకుంటున్నానని, రెహ్మాన్ కు పిల్లలకు భారం కాదలుచుకోలేదని అన్నారు.

“మేమింకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. దేవుడి దయ వల్ల ట్రీట్ మెంట్ పూర్తయి, నేను చెన్నై తిరిగొచ్చి అన్ని విషయాలు చెబుతాను. ఈలోగా రెహ్మాన్ కు వ్యతిరేకంగా దయచేసి ఎలాంటి స్టోరీలు వద్దు.”

రెహ్మాన్ తన భార్య నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన రోజునే, అతడి టీమ్ లో పనిచేసే మోహిని డే అనే మహిళ కూడా తన భర్తకు విడాకులిచ్చింది. దీంతో రెహ్మాన్ పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అలా తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలపై ఇప్పటికే లీగల్ గా చర్యలకు ఉపక్రమించాడు రెహ్మాన్.

9 Replies to “మా ఆయన బంగారం: రెహ్మాన్ భార్య”

  1. bharya: Dubai nunchi venakki raa.

    mogudu: ledu ikkade baagundi. nenu raanu.

    Bharya: Aithe nenu social media lo divorce istunna ani petta

    mogudu: nenu kooda ade petta

    idi matter. Finally all settled emo. pillala kosam kalisipoyam antaremo. janam picchollu ayye laa vunnaru.

  2. 3 పిల్లల్ని కన్న భార్య కి ఆరోగ్యం బాగా లేనప్పుడే కదా, ఆ భార్య కి భర్త తోడుగా వుండాలి.

    విడాకులు గిఫ్ట్ గా ఇస్తాడా ?

  3. ఎమిటో సెలబ్రిటీ జంటలు తీరూ వేరు గా ఉంటాయి,, విడాకుల కి వెళ్ళాక మేము ఫ్రెండ్స్ గా విడిపోయాము అంటారు,, ఫ్రెండ్స్ గా విడిపోవడం ఎందుకు హ్యాపీ గా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చెయ్యాలి కదా,రెహమాన్ భార్య భర్త బంగారు అయ్యినప్పుడు 30 ఏళ్లు కాపురం చేసి టీనేజ్ పిల్లల ఉండగా విడిపోవడం ఎందుకు,,, రెహన్ భార్య భర్త బంగారు అయ్యినప్పుడు 30 ఏళ్లు కాపురం చేసి టీనేజ్ పిల్లల ఉండగా విడిపోవడం ఎందుకు,,,ఆమెకి ఆరోగ్యం బాగోనప్పుడు భర్త తోడు ఉంటే బెటర్ కదా,,అసలు కారణాలు వదిలేసి ఏమేమో చెప్పుతుంటారు,,

Comments are closed.