వెరైటీ కొరియన్ సినిమాలను హక్కులు కొని మరీ రీమేక్ చేసే సంస్థ గురు ఫిలింస్. ఈ సంస్థ సురేష్ మూవీస్ కలిసి నిర్మించిన సినిమా శాకిని ఢాకిని. ఇద్దరు హీరోయిన్లు రెజీనా..నివేదా థామస్ లు కీలకపాత్రల్లో నటించిన సినిమా.
పోలీస్ ట్రయినింగ్ లో ఉప్పు..నిప్పులా వుండే ఇద్దరు అమ్మాయిలు, అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న మరో అమ్మాయిని ఎలా కాపాడారు అన్నది కథ. ఈ రోజు విడుదల చేసిన ట్రయిలర్ ఈ లైన్ నే చెబుతోంది.
వాస్తవానికి ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ ఓటిటి కోసం తయారు చేసారు. అందుకే కమర్షియల్ ఫార్మాట్ కు కాస్త దూరంగా, స్టిక్ట్ టు ది జానర్ అన్నట్లు చేసారు. కానీ ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకే వస్తోంది. ట్రయిలర్ ను ఇంట్రస్టింగ్ గానే కట్ చేసారు.
సినిమా స్క్రీన్ ప్లే నడిచినట్లే ట్రయిలర్ ను కూడా అదే రూట్లో నడిపారు. టేకింగ్, సీన్లు, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ అన్నీ ఫిట్ గానే సెట్ అయ్యాయి. సక్పెన్స్ ను, టెంపోను బాగానే మెయింటెయిన్ చేసారు. ఫుల్ లెంగ్త్ లో సినిమాను ఎలా గ్రిప్పింగ్ గా తీసారన్నదాన్ని బట్టి విజయం ఆధారపడి వుంటుంది.