రామ్ చరణ్- ఉప్పెన బుచ్చిబాబు సినిమా వర్కింగ్ టైటిల్ పెద్ది. ఈ సినిమా ఎప్పటి నుంచో సెట్ మీదకు వెళ్లడానికి రెడీగా వుంది. కానీ గేమ్ ఛేంజర్ కారణంగా లేటు అవుతూ వస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి కాలేదు కానీ రామ్ చరణ్ వర్క్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు పెద్ది సినిమాకు టైమ్ వచ్చింది. అయితే అలా అని ఇప్పుడే సెట్ మీదకు వెళ్లదు. ఎందుకంటే ఈ సినిమాలో పాత్రకు రామ్ చరణ్ గెడ్డం.. మీసాలు.. జుట్టు పెంచాల్సి వుంది. అందుకు కనీసం రెండు నెలలు అయినా పడుతుందని అంచనా.
అందువల్ల సెప్టెంబర్ నుంచి సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. ఇప్పటికి మూడు పాటలు సిద్దం చేసారు సంగీత దర్శకుడు రెహమాన్- దర్శకుడు బుచ్చిబాబు కలిసి. మిగిలిన పాటలు కూడా సినిమా సెట్ మీదకు వెళ్లే లోపే రెడీ అయిపోతాయని తెలుస్తోంది. దాదాపు రెండేళ్లకు పైగా ఈ సినిమా స్క్రిప్ట్ మీదనే వున్నారు దర్శకుడు బుచ్చిబాబు. ఎప్పటి కప్పుడు ఫైన్ ట్యూన్ చేస్తూనే వున్నారు.
ఈ సినిమాకు హీరోయిన్ గా జాన్వి కపూర్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు, పాన్ ఇండియా స్టార్ కాస్ట్ ను జత చేస్తున్నారు. రిద్ది సినిమాస్ సంస్థపై వెంకట సతీష్ కిలారు తో కలిసి మైత్రీ మూవీస్ ఈ సంస్థను నిర్మిస్తున్నాయి.
జనం పట్టించుకోరు