విల‌క్ష‌ణ న‌టుడి రెండో భార్య కూడా విడాకుల బాట‌

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీకి పెళ్లి క‌లిసిరాన‌ట్టుంది. కార‌ణాలేవైనా ఆయ‌న నుంచి విడాకులు తీసుకునేందుకు రెండో భార్య అలియా సిద్దిఖీ సిద్ధ‌మ‌య్యారు. నవాజుద్దీన్ మొద‌ట‌ షీబాను పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహ బంధం…

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీకి పెళ్లి క‌లిసిరాన‌ట్టుంది. కార‌ణాలేవైనా ఆయ‌న నుంచి విడాకులు తీసుకునేందుకు రెండో భార్య అలియా సిద్దిఖీ సిద్ధ‌మ‌య్యారు. నవాజుద్దీన్ మొద‌ట‌ షీబాను పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహ బంధం ఎంతోకాలం సాగ‌లేదు. దీంతో  ఆమె నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.

ఆ త‌ర్వాత అలియాను న‌వాజుద్దీన్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. తాజాగా లాక్‌డౌన్ ఉన్న‌ప్ప‌టికీ విడాకుల ప్ర‌క్రి య‌కు అలియా సిద్దిఖీ శ్రీ‌కారం చుట్టారు. ఇ-మెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా ఈ నెల 7న విడాకుల నోటీసులు న‌వాజుద్దీన్‌కు పంపిన‌ట్టు అలియా త‌ర‌పు లాయ‌ర్ అభ‌య్ తెలిపారు.

విడిపోయిన అనంతరం అలియాకు చెల్లించాల్సిన భరణం గురించి కూడా ఆ నోటీసులో పేర్కొన్న‌ట్టు లాయ‌ర్ వెల్ల‌డించారు. కాగా నవాజుద్దీన్‌, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని… లీగల్‌ నోటీసులకు నవాజుద్దీన్‌ ఇంత వరకు స్పందించ లేదని లాయ‌ర్ తెలిపారు. ఇదిలా ఉండ‌గా  పవిత్ర రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని మే 12న నవాజుద్దీన్‌ ముంబై నుంచి స్వస్థలం బుధానా(ఉత్తరప్రదేశ్‌)కు వెళ్లారు.  నవాజుద్దీన్‌ మాట్లాడుతూ నిబంధనల మేరకు తమ కుటుంబమంతా హోం క్వారంటైన్‌లో స్వీయ నిర్బంధంలో ఉంటోంద‌న్నారు. ఎవరినీ కలిసే ప్రయత్నం చేయమని ఆయ‌న‌ స్పష్టం చేశారు. 

కేసీఆర్ న్యూ రూల్స్ అదుర్స్

ప్రయాణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధం