చాలా ఒత్తిడి తెచ్చారు – సోనాక్షి

తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది హీరోయిన్ సోనాక్షి సిన్హా. జహీర్ ఇక్బాల్ ను ఈమధ్య ఆమె పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి సోనాక్షి ఇంట్లోనే సింపుల్ గా జరిగింది. Advertisement…

తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది హీరోయిన్ సోనాక్షి సిన్హా. జహీర్ ఇక్బాల్ ను ఈమధ్య ఆమె పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి సోనాక్షి ఇంట్లోనే సింపుల్ గా జరిగింది.

అయితే ఇలా సింపుల్ గా పెళ్లి చేసుకోవడం తమ కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికీ నచ్చలేదని తెలిపింది సోనాక్షి సిన్హా. ఆమె సోదరుడికి 2015లో వివాహం జరిగితే ఏకంగా 8వేల మంది వచ్చారంట. సో.. సోనాక్షి పెళ్లిని కూడా గ్రాండ్ గా చేయాలని శత్రుఘ్న సిన్హా భావించారట.

కానీ సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని తను, జహీర్ ముందే నిర్ణయించుకున్నామని తెలిపింది సోనాక్షి. అందుకే తమ నివాసంలో కేవలం 20 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్డ్ వివాహం చేసుకున్నట్టు వెల్లడించింది.

పెళ్లి తర్వాత రిసెప్షన్ ఏర్పాటుచేసింది ఈ జంట. ఆ రిసెప్షన్ కు కూడా లిమిటెడ్ గానే ఆహ్వానాలు అందించింది ఈ జంట. దీనిపై సోనాక్షి స్నేహితురాలు హుమా ఖురేషీ బాహాటంగానే తిట్టిందంట. మరిన్ని పార్టీలు, ఫంక్షన్లు ఆశించానని.. తనను నిరాశపరిచావని సోనాక్షికి చెప్పిందట.

ఇక స్టయిలిస్ట్ మోహిత్ అయితే మరింత బాధపడ్డాడట. పెళ్లిలో సోనాక్షిని 5 రకాల డిజైనరీ దుస్తుల్లో ఊహించుకున్నాడట. కానీ సోనాక్షి మాత్రం పెళ్లి మొత్తం ఒకే చీరలో కనిపించి నిరాశపరిచిందంట. ఇలా ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, మనసుకు నచ్చినట్టు పెళ్లి చేసుకున్నామని వెల్లడించింది సోనాక్షి. అన్నట్టు పెళ్లికి వేదికగా మారిన సొంతింటిని సోనాక్షి తాజాగా అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.

13 Replies to “చాలా ఒత్తిడి తెచ్చారు – సోనాక్షి”

Comments are closed.