లైఫ్ లైన్ దొరుకుతుందా?

అందం అందరికీ ఉంటుంది. అదృష్టం అతికొద్ది మందిని మాత్రమే వరిస్తుంది. అలాంటి అదృష్టానికి ప్రతిసారి ఆమడ దూరంలో ఆగిపోతోంది కావ్య థాపర్. మంచి ప్రాజెక్టులు పడుతోంది కానీ సక్సెస్ లు మాత్రం కొట్టలేకపోతోంది. Advertisement…

అందం అందరికీ ఉంటుంది. అదృష్టం అతికొద్ది మందిని మాత్రమే వరిస్తుంది. అలాంటి అదృష్టానికి ప్రతిసారి ఆమడ దూరంలో ఆగిపోతోంది కావ్య థాపర్. మంచి ప్రాజెక్టులు పడుతోంది కానీ సక్సెస్ లు మాత్రం కొట్టలేకపోతోంది.

ఈగల్ సినిమాతో ఈ ఏడాదిని ప్రారంభించింది కావ్య థాపర్. మంచి ప్రాజెక్ట్ ఇది. టీజర్, ట్రయిలర్ తో అంచనాలు కూడా బాగానే సెట్ చేసింది. కట్ చేస్తే, సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. కావ్య థాపర్ కు అస్సలు కలిసిరాలేదు ఈగల్.

అయినప్పటికీ ఆమెకు అవకాశాలొచ్చాయి. సందీప్ కిషన్ సరసన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా చేసింది. ఆ మూవీ మాత్రం ఈ ముద్దుగుమ్మకు ఓ మోస్తరుగా కలిసొచ్చింది. అయితే ఆ వెంటనే అతిపెద్ద ఫ్లాప్.

రామ్, పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో హీరోయిన్ గా చేసింది కావ్య థాపర్. భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా, ష్యూర్ షాట్ హిట్ అనుకుంది. కానీ దురదృష్టం వెంటాడింది. ముద్దుగుమ్మకు మళ్లీ ఫ్లాప్ తప్పలేదు.

ఇలా పడుతూలేస్తూ సాగుతున్న కావ్య థాపర్ ఇప్పుడు మరో లైఫ్ లైన్ కు దగ్గరగా వచ్చింది. అదే విశ్వం సినిమా. గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చేనెల రిలీజ్ అవుతోంది. ఈ మూవీ హిట్టయితే ఆమె కెరీర్ సెట్ అయినట్టే. లేదంటే అంతే సంగతులు.

4 Replies to “లైఫ్ లైన్ దొరుకుతుందా?”

Comments are closed.