బ్రేకప్స్ బయటపెట్టిన హీరోయిన్

చాలా హీరోయిన్లపై పుకార్లు వస్తుంటాయి కానీ తమన్నాపై మాత్రం చాలా తక్కువ. ఆమె లవ్ లో పడినట్టు లేదా ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నట్టు రూమర్లు పెద్దగా రాలేదు. అలా అని ఆమె లవ్…

చాలా హీరోయిన్లపై పుకార్లు వస్తుంటాయి కానీ తమన్నాపై మాత్రం చాలా తక్కువ. ఆమె లవ్ లో పడినట్టు లేదా ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నట్టు రూమర్లు పెద్దగా రాలేదు. అలా అని ఆమె లవ్ లో పడలేదని అర్థం కాదు.

తను కూడా లవ్ లో పడ్డానని, తన జీవితంలో 2 బ్రేకప్స్ ఉన్నాయని తెలిపింది తమన్న. ఒకటి టీనేజ్ లో జరగ్గా, ఇంకోటి తనకు బాగా ఊహ వచ్చి, లోకం పోకడ తెలిసిన తర్వాతే జరిగిందని వెల్లడించింది.

“నేను చాలా చిన్నదాన్ని. అప్పుడే మొదటి బ్రేకప్ జరిగింది. నా భాగస్వామి కోసం నేను నా అవసరాలు, కోరికలు వదులుకోగలనా అనే విషయం నాకప్పుడు తెలియదు. మరో బ్రేకప్ నాకు కాస్త వయసొచ్చిన తర్వాతే జరిగింది. అయితే ఆ రిలేషన్ షిప్ లో నా భాగస్వామి, లాంగ్ రన్ లో నా జీవితంపై సరైన ప్రభావం చూపించలేడని అనిపించింది. అందుకే అది బ్రేకప్ అయింది.”

ఇలా తన జీవితంలో జరిగిన 2 బ్రేకప్స్ గురించి బయటపెట్టింది తమన్న. 34 ఏళ్ల ఈ నటి ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది. తన లవ్ మేటర్ ను ఆమె చాన్నాళ్ల కిందటే బయటపెట్టింది. గతంలో ఆమె విరాట్ కోహ్లి, తమిళ నటుడు కార్తితో డేటింగ్ లో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి.

5 Replies to “బ్రేకప్స్ బయటపెట్టిన హీరోయిన్”

Comments are closed.