సలార్ 2, కల్కి 2, దేవర 2, పుష్ప 3, ఇండియన్ 3 ఇలా చాలా వున్నాయి. ప్రతీదీ సీక్వెల్ నే. కొన్ని అయితే చెప్పకుండా సీక్వెల్ కు చిన్న డోర్ ఓపెన్ చేసి పెడతారు. సినిమా హిట్ అయితే అలాంటి డోర్ లోంచి వెళ్లి సీక్వెల్ బయటకు తీస్తారు. డిజాస్టర్ అయితే సైలంట్ గా వుండిపోతారు. భారీ పాన్ ఇండియా సినిమాలకు సీక్వెళ్లు మాత్రం రావాల్సిందే. ఎందుకంటే పెద్ద హీరోలు, దర్శకులు, భారీ బడ్జెట్ కదా. ఇప్పుడు తెలుగులో ఇలా ప్లాన్ చేసి వున్న సీక్వెళ్లు అన్నీ ఎప్పుడు తెరపైకి వస్తాయన్నది మాత్రం క్లారిటీ లేదు. గ్యారంటీ లేదు. అదీ పరిస్థితి.
ప్రభాస్ సలార్ పెద్ద హిట్. మరి సలార్ 2 వెంటనే రావాలి కదా. కానీ ఇప్పటి వరకు సినిమా మొదలుపెట్టిన జాడ లేదు. అసలు మొదలు పెడతారో లేదో తెలియదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ వేరే సినిమా మీదకు వెళ్లిపోతున్నారు. అది పూర్తి చేసి వచ్చేసరికి ఎంత కాలం అవుతుందో? ఈ లోగా ప్రభాస్ కూడా రెండు మూడు సినిమాలు పూర్తి చేయాలి. అందువల్ల సలార్ 2 వస్తే కనుక 2026లోనే అనుకోవాలి.
కల్కి 2. ఇది కూడా ప్రభాస్ సినిమానే. తొలి పార్ట్ బ్లాక్ బస్టర్. అందువల్ల మలి పార్ట్ మీద బోలెడు అంచనాలు, మరింత వ్యాపారం వుంటుంది. అందువల్ల మరింత కేర్ అవసరం. పైగా ప్రభాస్ వెంటనే ఈ సినిమానే చేస్తే లైనప్ బాగుండదు. ఈ లోగా కనీసం మరో సినిమా ఒక్కటి అయినా విడుదల కావాలి. రాజాసాబ్ సినిమా సగం వరకు అయింది. హను రాఘవపూడి సినిమా వుంది. ఈ రెండు సినిమాలు చేసుకుంటూ కల్కి 2 మీదకు వస్తూ, పోతూ వుండాలి. అందువల్ల 2025 లో కల్కి 2 వస్తుందా అంటే అనుమానమే.
ఎన్టీఆర్ దేవర సినిమా ఇంకా విడుదల కావాల్సింది. దానికి కూడా సీక్వెల్ వుంది. దేవర వన్ తరువాత ప్రశాంత్ నీల్ సినిమా చేయాలి. ఎలా లేదన్నా ఓ ఏడాది పడుతుంది. అంటే 2025 చివరి వరకు అన్నమాట. ఈ మధ్యలో అప్పుడప్పుడు దేవర సినిమా చేసినా, కొంత కంటెంట్ అవైలబుల్ వున్నా కూడా దేవర 2 సినిమా 2026 కే షెడ్యూలు చేసే అవకాశం ఎక్కువ వుంది.
పుష్ప 2 ఈ ఏడాది చివరిలో వస్తుంది అనుకుంటున్నారు. పుష్ప 3 కూడా వుంది. కానీ అది ఎప్పుడొస్తుందో. ఎందుకంటే 2 తీయడానికే రెండేళ్లు పట్టింది. పైగా పుష్ప 2 తరువాత బన్నీ వేరే సినిమా చేసి రావాలి. అలా చేసే సినిమానే ఏడాదిన్నర పడుతుంది. అంటే పుష్ప 3 నిజంగా వుంటే ఏ 2027 లోనో వస్తుందేమో?
శంకర్ సినిమా ఇండియన్ 3 వుంది. ఇండియన్ 2 డిజాస్టర్. నిర్మాతలు ఇండియన్ 2 నష్టాల నుంచి తేరుకుని అప్పుడు 3 మీదకు రావాలి. శంకర్ సంగతి పక్కన పెడితే కమల్ హాసన్ రెడీ కావాలి. అంటే చాలా చాలా టైమ్ పడుతుంది. 2025 వస్తే అది వండర్ నే. 2026 కు వస్తుందేమో?
మొత్తానికి సీక్వెళ్లు, పాన్ ఇండియాలు పెట్టుకుని, హీరోలు తమ సినిమాలను తామే తగ్గించేసుకుంటున్నారు. భారీ మొత్తాలు, అంకెలు కనిపిస్తున్నాయి. తప్ప సినిమాలు మాత్రం కనిపించడం లేదు.
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
జనం పట్టించుకోరు
ఎప్పుడు వచ్చినా మేం థియేటర్లో చూడం