Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ గొడవేమిటి?

ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ గొడవేమిటి?

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా చకచకా రెడీ అవుతోంది. ఈ ఏడాది దసరా టార్గెట్ ను మిస్ కాకూడదన్నది ఆలోచన. కరోనాకు ముందే ఈ సినిమా థియేటర్ హక్కులు ఏరియాల వారీ విక్రయించేసారు. అడ్వాన్స్ లు నిర్మాతకు అందేసాయి. వాటి వడ్డీల మాటేమిటి అన్న పాయింట్ అలాగే వుంది. అదీ కాక ఓవర్ సీస్ లో కరోనా అనంతరం సినిమా ల పరిస్థితి బాగాలేదు. దాంతో అక్కడ చిన్న తకరారు బయల్దేరింది.

ఓవర్ సీస్ మొత్తాన్ని ఒకే పార్టీ టోటల్ సింగిల్ పేమెంట్ తొ కొనుక్కుంది. ఆ తరువాత ఓ నలుగురు బయ్యర్లు కలిసి గల్ఫ్ మినహా మిగిలిన ఓవర్ సీస్ ను బేరం చేసి కొనుకున్నారు. ఇందుకు గాను 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు.

ఇదిలా వుంటే ఈ రెండో పార్టీ దగ్గర కేవలం యుఎస్ మరో మరో పార్టీ నాలుగు కోట్లు అడ్వాన్స్ ఇచ్చి తీసుకుంది. ఇలా మొత్తం ఓవర్ సీస్ కు మూడు పార్టీలు అయ్యాయి. ఒకటి డైరెక్ట్..రెండు ఇండైరెక్ట్.

ఇలాంటి నేపథ్యంలో కరోనా వచ్చింది. దాంతో యుఎస్ కు కొన్న వ్యక్తి తనకు రైట్స్ వద్దని, తన నాలుగు కోట్లు అడ్వాన్స్ వెనక్కు ఇవ్వమని రెండో పార్టీని కోరుతున్నాడు. దానికి ఆ పార్టీ ససేమిరా అంటోంది. దీంతో పంచాయతీలు నడుస్తున్నాయి. 

ఈ పంచాయతీతో నిర్మాత దానయ్యకు సంబంధం లేదు. ఎందుకంటే ఆయన అమ్మింది హోల్ సేల్ గా ఒకే పార్టీకి. ఆ పార్టీకి ఈ గొడవతో సంబంధం లేదు. ఎందుకంటే ఆయన అమ్మింది థర్డ్ పార్టీకి కాదు. రెండో పార్టీకి. గొడవ జరుగుతున్నది రెండో పార్టీకి మూడో పార్టీ కి మధ్య.

అదీ సంగతి.

తానకు వెట‌క‌రం ఎక్కువగా ఉంటుంది

6 పాటలు, 6 ఫైట్ల సినిమా కాదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?