బిగ్ బి అమితాబ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాలీవుడ్ సినిమా ‘మే డే’. దీనికి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ దర్శకుడు, నిర్మాత కావడం విశేషం ఏడేళ్ల తర్వాత ఈ స్టార్ హీరోలిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడం మరో విశేషం.
ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అంగీరా ధార్ కథానాయికలు. ‘మే డే’ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ సైతం ఈ రోజే మొదలుపెట్టారు.
ఏప్రిల్ 29, 2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తొలి సన్నివేశానికి అజయ్ దేవగన్ స్నేహితుడు, జోతిష్యుడు బాలు మున్నంగి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ మాట్లాడుతూ ‘మే డే’ చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా పూర్తయ్యేవరకూ ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం. ఏప్రిల్ 29, 2022న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు.