ఒకరోజు ముందుగానే ‘జయమ్ము’

కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నేటివ్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో ముస్తాబయిన సినిమా జయమ్ము నిశ్చయమ్మురా. పూర్ణ కథానాయిక. ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేద్దామని ప్లాన్…

కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నేటివ్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో ముస్తాబయిన సినిమా జయమ్ము నిశ్చయమ్మురా. పూర్ణ కథానాయిక. ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేద్దామని ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని ఓ రోజు ముందే విడుదల చేస్తున్నారు. అంటే నవంబర్ 24న అన్నమాట. నవంబర్ 25న రెండు సినిమాలు వుండడంతో ఒక రోజు ముందే రావాలని ఇలా చేసారనుకోవాలి.

శ్రీనివాస రెడ్డి హీరోగా కనుమూరి శివరాజ్ తనే స్వయంగా స్క్రిప్ట్,డైరక్షన్ చేస్తూ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా పాట ఒకటి విడుదలై కాస్త బజ్ తెచ్చింది. అలాగే కమెడియన్ ప్రవీణ్ తత్కాల్ క్యారెక్టర్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని తరువాత కృష్ణ భగవాన్ లుక్ కూడా విడుదల చేస్తున్నారు. ఇలా ఒక్కో బిట్ వదులుతూ సినిమాకు బజ్ పెంచే పనిలో వుంది యూనిట్.