ఎప్పుడో పూర్వకాలంలో పాట వుంటుంది..మేము అన్నాదమ్ములం..మేము తోడి కోడళ్లం అని. ఈ ఫోటొ చూస్తుంటే అలాంటి పాటలే గుర్తుకు వస్తాయి మరి. అక్కినేని నాగ్ చైతన్య..అక్కినేని అఖిల్..ఇద్దరు ఒకేసారి తమతమ జీవన సహచరులను తామే ఎంచుకోవడమే కాకుండా, తండ్రి నాగ్ చేత ఓకె అనిపించుకున్నారు. అంతే కాదు, త్వరలో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరగబోతోంది.
ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో చైతు వుడ్ బీ కమ్ హీరోయిన్ సమంత ఓ మాంచి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలో అక్కినేని కుటుంబం రెండు జంటలు ముచ్చటగా కొలువుతీరాయి. ముచ్చటైన జంటగా చైతూ సమంత కనిపిస్తుంటే, మా మంచి మరిది అన్నట్లు అఖిల్ వదినగారి చేయిపట్టుకుని మరీ మెరిసాడు.
వీరందరి నడుమ అక్కినేని వారింట అడుగుపెట్టే జీవీకే వారమ్మాయి తళుక్కన మెరిసింది. మొత్తానికి మాంచి ఫ్యామిలీ ఫోటొ వదిలింది సమంత సోషల్ నెట్ వర్కలోకి ఈ సండేనాడు.