ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై అనుమానాలు.. ఎన్నాళ్లిలా?

ఇప్పుడు కాదు.. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఈవీఎంల ప‌నితీరుపై అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేశార‌నే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. నాడు ఆ అనుమానాల‌ను వ్య‌క్తం…

ఇప్పుడు కాదు.. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఈవీఎంల ప‌నితీరుపై అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేశార‌నే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. నాడు ఆ అనుమానాల‌ను వ్య‌క్తం చేసింది క‌మ‌లం పార్టీ వాళ్లు, కాషాయ వాదులు, ఆ పార్టీ సానుభూతి ప‌రులు! కావాలంటే వెన‌క్కెళ్లి చూసుకోవ‌చ్చు. నాటి ప‌త్రిక‌ల‌ను చ‌దువుకోవ‌చ్చు. 2009 ఎన్నిక‌ల్లో దేశంలో రెండోసారి కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ కూట‌మి అధికారంలోకి వ‌చ్చే స‌రికి క‌మ‌లం పార్టీ మ‌ద్ద‌తుదార్లు ఈవీఎంల‌ను అనుమానించారు. దీనిపై నాడు ఎన్డీయే కూట‌మిలోని సుబ్ర‌మ‌ణ్య స్వామి పెద్ద పోరాట‌మే చేశారు!

కాంగ్రెస్ పై అప్ప‌ట్లో నిర్విరామ పోరాటం చేసిన సుబ్ర‌మ‌ణ్య‌స్వామి 2009 లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లోనూ ఈవీఎంలు ట్యాంప‌ర్ అయ్యాయంటూ వ్యాక్యానించారు. అందుకు సంబంధించి మినీసైజు ఉద్య‌మాన్ని న‌డిపించారు. ఎంత‌లా అంటే ఒక ద‌శ‌లో వైఎస్ మ‌ర‌ణానికి, ఈవీఎంల ట్యాంప‌రింగ్ కు కూడా స్వామి ముడిపెట్టారు. ఈవీఎంల ట్యాంప‌రింగ్ గురించి వైఎస్ కు అవ‌గాహ‌న ఉంద‌ని, ఆయ‌న మ‌ర‌ణంపై అందుకే త‌మ‌కు అనుమానాలు అంటూ స్వామి అప్ప‌ట్లో ట్వీటారు!

సోనియాగాంధీ ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేయించిందంటూ స్వామి అప్ప‌ట్లో అలా చెల‌రేగిపోయేవారు. కేవ‌లం సుబ్ర‌మ‌ణ్య‌స్వామే కాదు, అప్ప‌ట్లో కాంగ్రెస్ కు అధికారం అంటే అది ఈవీఎంల చ‌లువ అన్న‌ట్టుగా బీజేపీ వాదులు విరుచుకుప‌డేవారు. అయితే వారికి ఆ త‌ర్వాత ఈవీఎంల‌పై న‌మ్మ‌కం క‌లిగింది. ఈవీఎంల ట్యాంప‌ర్ చేసి కాంగ్రెస్ గెలిచింద‌ని వాదించిన వారు, ఆ త‌ర్వాత చాలా మారారు. ప్ర‌త్యేకించి 2014 ఎన్నిక‌ల‌తో వారికి క‌నువిప్పు క‌లిగింది. ఆ నాడు ఎన్నిక‌లను ఈవీఎంల‌తోనే నిర్వ‌హించినా దేశంలో ఎన్డీయే కూట‌మి అధికారంలోకి రావ‌డంతో, బీజేపీకి భారీ ఎత్తున సీట్లు ల‌భించ‌డంతో వారికి ఈవీఎంల‌పై విప‌రీత‌మైన న‌మ్మ‌కం పెంపొందింది.

అప్ప‌టి వ‌ర‌కూ ఈవీఎంలంటే వాటిని కాంగ్రెస్ టాంప‌ర్ చేయించుకుంటుంద‌ని వాదించిన వాళ్లు కాస్తా.. తాము అధికారంలోకి వ‌చ్చే స‌రికి.. ఈవీఎంలలో లోపం క‌నిపించ‌లేదు! మ‌రి 2009 ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేయించుకుని గెలిచిన కాంగ్రెస్ పార్టీ, 2014లో ఎందుకు చేయించుకోలేక‌పోయిందో ఆలోచించేంత స‌మ‌యం కూడా వారికి క‌ల‌గ‌లేదు! ఆ త‌ర్వాత కూడా దేశంలో చాలా మంది ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో ఈవీఎంల‌పై అనుమానాలు వ‌చ్చాయి.

2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఈవీఎంల మీద పోరాడింది. ఈవీఎంల మీద ఎన్నిక‌లే వ‌ద్దంటూ అప్ప‌ట్లో నానా హ‌డావుడి చేశారు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు. దేశంలో ఎవ‌రు సెల్ ఫోన్ వాడుతున్నా దానికి త‌నే కార‌ణం అని బాహాటంగా చెప్పుకుంటూ, ఆ విధంగా త‌నే దేశాన్ని టెక్నాల‌జీ ప‌రంగా ముందుకు తీసుకెళ్తున్న‌ట్టుగా డ‌బ్బా కొట్టుకునే ఆయ‌న అప్ప‌ట్లో మోడీకి వ్య‌తిరేకంగా పోరాడుతున్న‌ట్టుగా చెప్పుకుంటూ ఈవీఎంల మీద ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ వ‌ద్దే వ‌ద్దంటూ ర‌చ్చ చేశారు. కాంగ్రెస్ ను ఈ విష‌యంలో క‌లుపుకున్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్, కోర్టుల చుట్టూ తిరిగారు. వీవీ ప్యాట్లు ఉన్నా.. ఈవీఎంలను న‌మ్మే ప్ర‌స‌క్తి లేద‌ని తేల్చారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు వీరాభిమానులు కూడా అదే వాద‌న చేశారు. ఈవీఎంల మీద జ‌రిగే ఎన్నిక‌లు ఎన్నిక‌లే కాద‌న్న‌ట్టుగా వారు వాదించారు. మోడీని అనుమానించారు.

అప్ప‌ట్లో కేంద్రంలో అధికారంతో ఉన్న వారికి వ్య‌తిరేకంగా ఉంటూ ఈవీఎంల మీద అనుమానాలు వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు, 2024 లో మాత్రం కేంద్రంతో అధికారంలో ఉన్న వారితో దోస్తీ చేస్తూ.. ఈవీఎంల మీద అనుమానాలు వ్య‌క్తం చేయ‌లేదు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈవీఎంలు న‌శించాలి అంటూ పెద్ద ఉద్య‌మాన్ని న‌డిపిన చంద్ర‌బాబు నాయుడు, 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం ఈవీఎంల మీద ఎలాంటి అనుమానాలు వ్య‌క్తం చేయ‌లేదు! 2019 ఎన్నిక‌లూ ఈవీఎం మీదే జ‌రిగాయి, 2024 ఎన్నిక‌లూ ఈవీఎంల మీదే జ‌రిగాయి. అయితే 2019లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో చంద్ర‌బాబు సున్నం పెట్టుకున్నారు.

మోడీని ఓడిస్తానంటూ అప్ప‌ట్లో చంద్ర‌బాబు హ‌డావుడి చేశారు. అప్పుడు ఈవీఎంలు మోసం అని చంద్ర‌బాబుకు అనిపించాయి, 2024 వ‌చ్చే స‌రికి మోడీ-చంద్ర‌బాబు భాయీభాయీగా బ‌రిలోకి దిగారు. దీంతో చంద్ర‌బాబు ఈవీఎంల మీద కించిత్ మాట మాట్లాడ‌లేదు! 2024 ఎన్నిక‌ల స‌మ‌యానికి చంద్ర‌బాబు చేతిలో అధికారం కూడా లేదు.

2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు అధికారంలో ఉన్నాడు. అయినా.. 2019లో మాత్రం ఈవీఎంలు చంద్ర‌బాబుకు నిద్ర‌లేకుండా చేశాయి, అస‌లు ఈవీఎంలతోనే ఎన్నిక‌లు నిర్వ‌హించేట్టు అయితే అస‌లు ఎన్నిక‌లే అవ‌స‌రం లేద‌ని చంద్ర‌బాబు భ‌క్తులు అప్ప‌ట్లో వాదించారు. మోడీ మోస‌గాడ‌ని, మోడీ మోసం చేస్తాడ‌ని, ఈవీఎంల‌తో చంద్ర‌బాబును ఓడిస్తాడ‌ని అప్ప‌ట్లో వీరు వాదించారు. అలా మోడీతో వైరి ఉన్న‌ప్పుడు ఈవీఎంల‌పై న‌మ్మ‌కం లేక‌పోవ‌డం, మోడీతో ఎన్నిక‌ల స‌మ‌యంలో దోస్తీ ఏర్ప‌డ్డాకా.. ఈవీఎంల మీద న‌మ్మ‌కం క‌ల‌గడం వెనుక రీజ‌న్లు ఏమిటో చంద్ర‌బాబు ఎలాగూ చెప్ప‌రు, చంద్ర‌బాబు అభిమాన‌వ‌ర్గాలు అయినా చెప్పాలి!

ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈవీఎంల మీద చాలా అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తూ ఉంది. హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కాంగ్రెస్ పూర్తి వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌డ‌మే గాక‌, మొత్తం ఎన్నిక‌ల ఫ‌లితాల‌నే మార్చేస్తున్నారంటోంది. త‌మ‌కు అనుకూలంగా ఉన్న ఫ‌లితాల‌ను వ్య‌తిరేకంగా అనౌన్స్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో సుబ్ర‌మ‌ణ్యస్వామి లాంటి వాళ్లు ఈవీఎంల మీద అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తే, కాంగ్రెస్ లైట్ తీసుకొమ్మంది. ఈవీఎంల‌తో మోసం చేయ‌డం కుద‌ర‌ద‌ని వాదించింది. మ‌రి అదే సాధ్యం అయితే 2014లోనే కాంగ్రెస్ అంత చిత్తుగా ఓడిపోదు కాబోలు! అయితే మోడీ చేతికి అధికారం ద‌క్కాకా మాత్రం ఈవీఎంల‌పై కాంగ్రెస్ పార్టీ చాలా అనుమానాలు వ్య‌క్తం చేస్తూ ఉంది.

ఇక ఈవీఎంల మీద 2019 ఎన్నిక‌ల నాడు అనుమానాల‌ను వ్య‌క్తం చేయ‌కుండా, 2024 లో ఈవీఎంల మీద నెపాన్ని నెడుతున్న వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. గ‌తంలో ఈ పార్టీ ఈవీఎంల మీద అనుమానాల‌ను వ్య‌క్తం చేయ‌లేదు. 2014 ఎన్నిక‌ల్లో తృటిలో విజ‌యం చేజారినా అప్పుడు కూడా ఈవీఎంల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాల‌ను వ్య‌క్తం చేయ‌లేదు. అయితే 2024 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఈ పార్టీ ఈవీఎంల మీద మాట్లాడుతూ ఉంది. ప్ర‌త్యేకించి సీల్ ఓపెన్ చేసిన ఈవీఎంల‌ను అస‌లు వాటిల్లోకి క‌లిపార‌ని, కొన్ని ఈవీఎంల పాస్ వ‌ర్డ్ లు తెలుగుదేశం నేత‌ల వ‌ద్ద ఉన్నాయ‌ని, కొన్ని వార్డుల్లో త‌మకు ఒక్క ఓటు కూడా ప‌డ‌లేదంటే అదంతా ఈవీఎంల మ‌హిమేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది.

పైపెచ్చూ ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప‌ర్సెంటేజీ విష‌యంలో ఈసీ వేర్వేరు ర‌కాల ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, పోలింగ్ రోజుకూ, ఆ త‌ర్వాత‌కూ వ్యత్యాస ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌టాన్ని, తెలుగుదేశం పార్టీకి భారీ భారీ మెజారిటీలు ద‌క్క‌డాన్ని ఆ పార్టీ ఉద‌హ‌రిస్తూ ఉంది. ఈ విష‌య‌మై కోర్టును ఆశ్ర‌యించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఊర‌ట అయితే ఎక్క‌డా ద‌క్క‌లేదు! హ‌ర్యానా ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి స్పందించింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ‌లోని అనుమానాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తూ ఉంది.

ఈ మొత్తం వ్య‌వ‌హారాల‌పై ప్ర‌జ‌లు ఎందుకు సీరియ‌స్ గా రియాక్ట్ కావ‌డం లేదంటే.. పార్టీలు ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో ర‌క‌ర‌కాలుగా మాట్లాడుతూ ఉండ‌టం. తాము ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్పుడు, గెలిచే ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు పార్టీలు ఈవీఎంల మీద అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం లేదు. అదే తాము ఓడిపోయిన‌ప్పుడు, ఓడిపోయే ప‌రిస్థితులు ఉన్నాయ‌నుకుంటున్న‌ప్పుడు ఈవీఎంల మీద అనుమానాలు వచ్చేస్తూ ఉన్నాయి.

చంద్ర‌బాబు అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా.. ఈవీఎంల మీద భిన్నాభిప్రాయాల‌నే వ్య‌క్తం చేశాయి. అందుకే ప్ర‌జ‌లు ఓడిపోయారు కాబ‌ట్టి ఇలానే మాట్లాడుతున్నారు, ఓడిపోతున్నారు కాబ‌ట్టే ఇలా మాట్లాడుతున్నారు.. అనే అనుకుంటున్నారు.

ఈవీఎంల మీద కానీ, ఎన్నిక‌ల ప్ర‌క్రియ మీద కానీ ప్ర‌జ‌ల‌కు అయితే ఇంకా పూర్తి స్థాయిలో అనుమానాలు రావ‌డం లేద‌నే చెప్పాలి. పార్టీల మీద అభిమానాలు, వ్య‌తిరేక‌త‌ల కొద్దీ కొంద‌రు మాట్లాడుతూ ఉండ‌వ‌చ్చు కానీ, ప్ర‌జ‌ల‌కు అయితే ఇంకా ఎన్నిక‌ల ప్ర‌క్రియ మీద విశ్వాసం ఉంది. అది ఉన్నంత వ‌ర‌కూ వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే రానున్న రెండు మూడేళ్ల‌లో వ‌చ్చే వివిధ ఎన్నిక‌లు మాత్రం ఈవీఎంలు, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరును జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించేలా చేయ‌బోతున్నాయి. అయితే ఇదే స‌మ‌యంలో గుర్తు చేయాల్సిన అంశం సీఈసీ ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌ల‌కు గురి అవుతూ ఉండ‌టం.

ఒక‌ప్పుడు సీఈసీ అంటే విమ‌ర్శ‌లు త‌క్కువ‌గా ఉండేవి, అయితే ఇప్పుడు మ‌రీ సిల్లీగా కార్న‌ర్ అవుతూ ఉంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈవీఎంలు, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ల సంగ‌తుల్లో ప్ర‌జ‌ల విశ్వాసం పెంపొందాలంటే.. సీఈసీ త‌న విశ్వాసాన్ని కోల్పోకోకుండా ఉండాలి. ఎన్నిక‌ల క‌మిష‌న్ స్వ‌తంత్ర‌త ప్ర‌జ‌లకు క‌నిపించాలి. ఎన్నిక‌ల డేట్ల‌ను, షెడ్యూల్ ను, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను అధికారంలో ఉన్న వారు కోరుకున్న డేట్ల‌కు అనుకూలంగా ఇస్తున్నార‌నే వాదన‌ల ద‌గ్గ‌ర నుంచి ర‌క‌ర‌కాల అంశాల్లో సీఈసీ ఈజీగా విమ‌ర్శ‌ల పాల‌వుతూ ఉంది. క‌నీసం ఇలాంటి ఆస్కారాల‌ను త‌గ్గించ‌డం ద‌గ్గ‌ర నుంచి సీఈసీ త‌న స్వ‌తంత్ర‌త‌ను నిల‌బెట్టుకుంటే.. ఇప్ప‌ట్లో భార‌త ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై అవిశ్వాసం ఏమీ తీవ్ర‌స్థాయికి వెళ్ల‌క‌పోవ‌చ్చు!

23 Replies to “ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై అనుమానాలు.. ఎన్నాళ్లిలా?”

  1. ఈవీఎం ల గొప్పతనం.. వాటి ప్రాముఖ్యత.. వాటి నిజాయితీ.. వాటి పనితనం.. వాటి నిబద్ధత గురించి మన జగన్ రెడ్డి 2019 లో గెలిచిన తర్వాత.. ఎంత చక్కగా..విడమరిచి.. చెప్పాడో.. ఒకసారి ఆ పాత వీడియోలు చూస్తే..

    మీకున్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి..

    అదే వీడియో సుప్రీం కోర్ట్ కి కూడా ఇస్తే.. వాళ్ళు కూడా నమ్ముతారు.. అంత చక్కగా చెప్పాడు మన 11 మోహన్ రెడ్డి..

  2. ఈవీఎంల గొప్పతనం.. వాటి ప్రాముఖ్యత.. వాటి నిజాయితీ.. వాటి పనితనం.. వాటి నిబద్ధత గురించి మన జగన్ రెడ్డి 2019 లో గెలిచిన తర్వాత.. ఎంత చక్కగా..విడమరిచి.. చెప్పాడో.. ఒకసారి ఆ పాత వీడియోలు చూస్తే..

    మీకున్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి..

    అదే వీడియో సుప్రీం కోర్ట్ కి కూడా ఇస్తే.. వాళ్ళు కూడా నమ్ముతారు.. అంత చక్కగా చెప్పాడు మన 11 మోహన్ రెడ్డి..

    1. మన వెంకటరెడ్డి గారు EVM ల గురించి ఎవరెవరు ఏమన్నారో వివరంగా రాసారు కానీ 2019లో EVMలు ఎంత గొప్పవో అరిటిపండు ఒలిచినట్లు చెప్పాడు అన్న. ఆ విషయం రాయడానికి మొహమాటపడ్డాడు…😀

      1. అంటే 2019 లో జగన్ రెడ్డి ఈవీఎంలు హ్యాక్ చేయడం వల్లనే గెలిచినట్టేగా..

        అదేగా మీ అనుమానం..

        మీ అనుమానం కూడా నిజం అయి ఉండొచ్చు..

  3. అందరికంటే ముందు ఈవీఎంల మీద అరిచింది చెంబుగాడు. వాడి గులఅనుచరుడైన వేమూరి అనేవాడితో ఏకంగా ఎలా హాక్ చెయ్యొచ్చో ప్రదర్శన చేసి అరెస్ట్ అయ్యే దాక వెళ్ళింది. కుమ్మక్కు అవగానే కథలు మారిపోతాయి….

    అదేంటో గాని ఈసారి గులగజ్జిగాళ్లే చెంబు 100 రోజుల పాలన వాడి జీవితంలోనే వరస్ట్ అని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు అప్పుడే….

    ప్రజలకి మాత్రం చాలా సమ్మగా వుంది.

    చేసినదానికి అనుభవించేవాళ్ళని చూస్తే అదోరకం ఆనందం.

    ఆలా చెయ్యకూడదని అదొక పాఠం!

    కానీ ప్రజలకి గొర్రెలకు తేడాలేదని నిరూపిస్తునే వున్నారు.

    1. నువ్వు బతికే ఉన్నావా ముత్తాత..

      విజయవాడ వరదల్లో కొట్టుకుపోయావేమో.. అని సాక్షి లో రాసుకున్నారు..

      నీ శవం దొరకగానే జగన్ రెడ్డి పరామర్శిద్దామని ప్లాన్ చేసుకొంటున్నాడని సాక్షి లో చెపుతున్నారు..

      పాపం.. జగన్ రెడ్డి డిసప్పోయింట్ అయిపోతాడు..

  4. పార్టీ లు ఓడిపోయినప్పుడు కాకుండా గెలిచినప్పుడు ఈ ప్రక్రియ మీద నమ్మకం లేదు, మేము రాజీనామా చేస్తాం, మళ్ళీ ballat పేపర్ తో ఎన్నికలు పెట్టండి అని డిమాండ్ చేసేంతవరకు!

  5. జగ్గడిని తమలపాకుతో, చంబా ని తలుపుచెక్క తో…

    RGV , సుబ్రమణ్యం స్వామి పిచ్చోడి చేతిలో రాయి లాంటోళ్ళు. వాళ్ళని నమ్ముకుంటే అంతే

Comments are closed.