ఉక్కు కార్మికులకు దసరా పస్తులు

ఎంతో ఘనమైన విశాఖ ఉక్కులో పనిచేసే కార్మికులకు అతి పెద్ద పండుగ అయిన విజయదశమి వేళ జీతాలు లేవు. దాంతో వారు పస్తులతో పండుగ పూట కాలక్షేపం చేస్తున్న పరిస్థితి ఉందని అంటున్నారు. గత…

ఎంతో ఘనమైన విశాఖ ఉక్కులో పనిచేసే కార్మికులకు అతి పెద్ద పండుగ అయిన విజయదశమి వేళ జీతాలు లేవు. దాంతో వారు పస్తులతో పండుగ పూట కాలక్షేపం చేస్తున్న పరిస్థితి ఉందని అంటున్నారు. గత నాలుగేళ్ళుగా ప్రైవేటీకరణ జోరుతో స్టీల్ ప్లాంట్ ని అతలాకుతలం చేస్తున్న యాజమాన్యం జీతాలను కూడా సరిగ్గా ఇవ్వడం లేదు.

దాంతో కార్మిక లోకం కుమిలిపోతోంది. కార్మికుల పండుగ అయిన దసరా వేళ జీతాలు లేక వేలాది కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. ఇక గత కొంతకాలంగా చూస్తే కార్మికులకు హెచ్ఆర్ఏని కట్ చేశారు. అలాగే బోనస్ అన్నది కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. పోనీ కడిగిన రాళ్ళుగా ఆ జీతాలు అయినా ఇస్తారు అనుకుంటే దానికి కూడా ఠికానా లేకుండా పోయింది అని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏ ఏటికి ఆ ఏడు దిగదుడుపే అన్నట్లుగా ఉక్కు కార్మికుల పరిస్థితి ఉంది. గత ఏడాది కార్మికులకు ఇరవై వేల రూపాయలను బోనస్ గా ఇచ్చారు. కానీ ఈసారికి జీతాలే లేవు అని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఉక్కు మంత్రిని కలిశారు. స్టీల్ ప్లాంట్ కి ఏమీ జరగదని అది బాగానే ఉంటుందని దానికి తాము రక్షిస్తామని ప్రకటించారు. దాంతో కార్మికులలో కొంత ఆశలు పెరిగాయి. అయితే జీతాలు కూడా లేకుండా దసరా పండుగ వేళ చేస్తారు అని వారు అసలు ఊహించలేకపోయారు అని అంటున్నారు.

పైపైన ప్రకటనలు చూస్తే స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగానే ఉంది అని బయట సమాజం అనుకోవచ్చు. కానీ స్టీల్ ప్లాంట్ లో మాత్రం వెలుగే లేదు అని కార్మికులు అంటున్నారు. ఒక పక్క ముడి సరుకు లేదు, ఉత్పత్తి తగ్గిపోయింది, జీతాలు కూడా ఇవ్వకుండా కార్మికులను ఆకలితో ఉంచుతున్నారు అని అంటున్నారు.

అంటే కూటమి నేతలు చెప్పేదానికి గ్రౌండ్ లెవెల్ లో స్టీల్ ప్లాంట్ లో జరిగిన దానికి ఎంతో తేడా ఉందని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ని ఆదుకుంటామని చెప్పేవారు ముందుగా కార్మికులకు జీతాలు ప్రతీ నెలా అందేలా చూడాలని అలగే కట్ చేసిన హెచ్ఆర్ఏ తో పాటు ప్రతీ దసరాకు ఇచ్చే బోనస్ ని ఈ ఏడాది కూడా ఇప్పించాలని ప్లాంట్ ని రక్షించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

10 Replies to “ఉక్కు కార్మికులకు దసరా పస్తులు”

  1. చూసావా GA…. అదే మన అన్నియ్యా ఐతే ఇప్పటికే అక్కడ స్టీల్ ప్లాంట్ ను లేపేసి క్యాపిటల్ సిటీ కట్టేసి, వాళ్ళందరికీ పని ఇప్పించే వాడు….పాపం…అంతేనా GA…

  2. 2002 Nizam Sugars and now Vizag steel plant. In 2002, 51% of Nizam sugars, which was valued around 1600+ crores, was sold to private people for a mere 196 crores scamming public treasury of 1400 crores. Now, Vizag steel plant which has 2L crores of assets is being offered at 2000 crores looting atleast 1.98L crores to treasury.

Comments are closed.