మ‌న్యంలో అయ్య‌న్న‌పాత్రుడి కామెంట్స్ అల‌జ‌డి!

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడి కామెంట్స్ ఉత్త‌రాంధ్ర‌లోని మ‌న్యంలో తీవ్ర అల‌జ‌డి సృష్టిస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడి కామెంట్స్ ఉత్త‌రాంధ్ర‌లోని మ‌న్యంలో తీవ్ర అల‌జ‌డి సృష్టిస్తున్నాయి. 1/70 చ‌ట్టాన్ని స‌వ‌రించాల‌ని అయ్య‌న్న‌పాత్రుడు అన‌డంతో మ‌న్యం ప్రాంతంలో జీవిస్తున్న గిరిజ‌నులు ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ భూముల్ని లాక్కుని ఇత‌రుల‌కు క‌ట్ట‌బెడ్తార‌నే భ‌యం అడ‌వి బిడ్డ‌ల్ని వెంటాడుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌న్యంలో రెండు రోజుల బంద్‌కు ఆదివాసీలు పిలుపునిచ్చారు. ఇవాళ రోడ్ల‌పైకి వ‌చ్చి త‌మ నిర‌స‌న తెలిపారు.

అలాగే బుధ‌వారం ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను స్తంభింప‌జేయ‌డం, విద్యాసంస్థ‌ల‌ను మూసి వేయాల‌ని పిలుపునిచ్చారు. 1/70 చ‌ట్టాన్ని స‌వ‌రించ‌డం అంటే అట‌వీ భూముల్ని ఇత‌రుల‌కు విక్ర‌యించ‌డానికి వెస‌లుబాటు క‌ల్పించ‌డ‌మే అని ఆదివాసీల ఆందోళ‌న‌కు ప్ర‌ధాన కార‌ణ‌మైంది. బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న అయ్య‌న్న‌పాత్రుడు కీల‌క కామెంట్స్ చేయ‌డంతో ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ఆలోచిస్తోందేమో అన్న భ‌యం వాళ్ల‌ను వెంటాడుతోంది. ఆదివాసీల ఆందోళ‌న‌కు వైసీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

అయితే ఆ చ‌ట్టంలో ఎలాంటి మార్పు తీసుకురామ‌ని మంత్రి ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, గిరిజ‌నుల్లో మాత్రం భ‌యం పోలేదు. అస‌లే అట‌వీ ప్రాంతాల్లో మైనింగ్ కోసం అధికారంలో ఉన్న వాళ్లు కాచుకుని ఉన్నార‌ని గిరిజ‌నులు అనుమానిస్తున్నారు. వాళ్ల అనుమానాల‌కు అయ్య‌న్న‌పాత్రుడి కామెంట్స్ బలం క‌లిగించాయి.

ఇప్ప‌టికైనా అడ‌వినే న‌మ్ముకున్న బ‌తుకుతున్న ఆ బిడ్డ‌ల‌కు ధైర్యం క‌లిగించేలా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయాల్సిన అవ‌స‌రం వుంది. లేదంటే గిరిజ‌నుల వ్య‌తిరేక‌త‌ను చ‌వి చూడాల్సి వుంటుంది.

3 Replies to “మ‌న్యంలో అయ్య‌న్న‌పాత్రుడి కామెంట్స్ అల‌జ‌డి!”

Comments are closed.