ఒడిషాకు బీజేపీ మేలు … కూటమి ఫైట్ చేయాల్సిందే !

కేంద్రంలోనూ ఒడిషాలోనూ బీజేపీ ప్రభుత్వం ఉన్నందువల్ల లాభాల గని అయిన కేకే రైల్వే లైన్ ని సులువుగా వదులుకోరని అంటున్నారు.

ఒడిషాలో గత ఏడాది నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీకి పొరుగున ఉన్న ఏపీతో మంచి సంబంధాలనే నెరపవచ్చు. ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. మంత్రి కూడా ఉన్నారు.

అయితే కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉంది. దాంతో ఒడిషా బీజేపీకి మేలు చేసే చర్యలను చేస్తున్నారని ప్రజా సంఘాలు విపక్షాలు విమర్శిస్తున్నాయి. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చామని వాల్తేరు డివిజన్ ని విశాఖ డివిజన్ గా మార్చి దాంత్గోనే కలిపి ప్రకటించామని కేంద్ర పెద్దలు చెప్పుకుంటున్నారు.

కానీ అక్కడే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని అంటున్నారు. విశాఖ రైల్వే డివిజన్ పూర్వ రూపం అయిన వాల్తేరు డివిజన్ లో భాగంగా కేకే రైల్వే లైన్ ఉండేది. కొత్తవలస కిరండోల్ రైల్వే లైన్ వాల్తేరు డివిజన్ కి లాభాల పంట పండించేది. ప్రతీ ఏటా పదివేల కోట్ల రూపాయల ఆదాయం ఆ విధంగా వాల్తేరు డివిజన్ కి దక్కి దేశంలో టాప్ పది డివిజన్లలో ఒకటిగా ఉండేది.

అటువంటి కేకే రైల్వే లైన్ ని ఒడిషాలోలో కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్ కి కేంద్ర రైల్వే శాఖ కేటాయించింది. దాంతో పెద్దగా రాబడి లేని రైల్వే లైన్లతో జోన్ ఇచ్చినా వర్కౌట్ ఎలా అవుతుందని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు కుడి చేతిలో జోన్ ఇచ్చి ఎడం చేతితో కేకే లైన్ ని ఓడిషాలో కలపడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నారు.

ఒడిషా రాష్ట్ర ప్రయోజనాలను అక్కడి బీజేపీ ప్రభుత్వం కాపాడుకుంది అని అంటున్నారు. ఒడిషాలో తమ సొంత ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ విధంగా చేశారా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. ఇపుడు తిరిగి కేకే లైన్ ని విశాఖ డివిజన్ లో కలపాలని లేకపోతే ఉద్యమిస్తామని ప్రజా సంఘాలు విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. దాంతో కేంద్రానికి ఈ విషయంలో విన్నవిస్తామని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారు.

అయితే ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు. కేంద్రంలోనూ ఒడిషాలోనూ బీజేపీ ప్రభుత్వం ఉన్నందువల్ల లాభాల గని అయిన కేకే రైల్వే లైన్ ని సులువుగా వదులుకోరని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పెద్దలు గట్టిగా ఒత్తిడి చేయడం ద్వారానే తిరిగి అరకు సహా అన్నీ కలసిన కేకే రైల్వే లైన్ సాధించగలరని అంటున్నారు. కేకే లైన్ ఇపుడు కూటమి పెద్దలకు సవాల్ గా మారింది అని అంటున్నారు.

5 Replies to “ఒడిషాకు బీజేపీ మేలు … కూటమి ఫైట్ చేయాల్సిందే !”

  1. కూటమి వారు అధికారం పంచుకుంటున్నారు కాబట్టి వారు పోరాటం చెయ్యరు. ఇది అన్న కు సువర్ణావకాశం. ఢిల్లీ లో దీక్ష చేసి సాధిస్తే మంచి మైలేజ్…అన్న గెలిచినా అతికొద్ది సీట్లలో రెండు ఏజెన్సీ నుండే

  2. ఐటమ్ అన్నాయ్.. గోల్డెన్ ఛాన్స్ దొరికింది. అసెంబ్లీ కెళ్ళి దీనిమీద కూటమిని చెడుగుడు ఆడరాదే??

    అసెంబ్లీ లో జాగ్రత్త అన్నొయ్.. అసలే అచ్చన్న ఒక గంట చాలు అంటున్నాడు

Comments are closed.