జగన్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాల నిఘా!

వైసీపీ ఫుటేజీ ఇవ్వకపోయే సరికి.. పోలీసులకు తాము అక్కడ నిఘా కెమెరాలు ఏర్పాటుచేసే పని సులువు అయింది.

ఏపీ పోలీసులకు లడ్డూ లాంటి అవకాశం వచ్చింది. ఒక్కసారిగా జగన్ నివాసాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని వారు తమ పోలీసు నిఘా కళ్ల పరిధిలోకి తీసుకువచ్చేశారు. ఇక మీదట జగన్ ఇంటికి ఎవరు ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వెళుతున్నారు? సమస్తం పోలీసు నిఘాకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా అవన్నీ పట్టించుకోకుండా ఉంటారని కాదు. కానీ.. ఎలాంటి చిన్న వివరమూ మిస్ కాకుండా.. ఆయన ఇల్లు మరియు పార్టీ ఆఫీసు చుట్టూతా పోలీసులు తాజాగా నిఘా కెమెరాలను ఏర్పాటు చేసేశారు. ఒక రకంగా వైసీపీ వర్గాలే పోలీసులకు అలాంటి నిఘా ఏర్పాటుచేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా అయింది.

వైసీపీ కేంద్ర కార్యాలయం ఎదుట గార్డెన్ లో ఈనెల 5వ తేదీన గడ్డి తగలబడి మంటలు చెలరేగాయి. ఈ విషయమై పార్టీ వర్గాలు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు అయింది. దర్యాప్తులో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు ఇవ్వాలని పోలీసులు అడిగితే పార్టీ వర్గాలు స్పందించలేదు. ఈనేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత చర్యల పేరుతో పోలీసులు నిఘా కెమెరాలను తామే ఏర్పాటుచేశారు. మొత్తం ఎనిమిది కెమెరాలు ఏర్పాటుచేసి తాడేపల్లి స్టేషన్ మానిటర్ కు అనుసంధానించారు.

వైసీపీ తరఫున పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు గానీ.. తమ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ వంటి ఆధారాలు కూడా ఇవ్వకపోతే దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుందని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం అని కూడా అంటున్నారు.

వైసీపీ ఫుటేజీ ఇవ్వకపోయే సరికి.. పోలీసులకు తాము అక్కడ నిఘా కెమెరాలు ఏర్పాటుచేసే పని సులువు అయింది. పార్టీ ఫుటేజీ ఇచ్చి ఉన్నాసరే.. పోలీసులు ఇలాంటి నిఘా కెమెరాలు పెట్టి ఉంటే గనుక.. రాజకీయ రాద్ధాంతం అయ్యేది. జగన్ చుట్టు నిఘా ఏర్పాటుచేస్తున్నారని.. ఎవరు వచ్చి వెళుతున్నారో తెలుసుకోవడానికే ఈ కెమెరాలు అని రకరకాల విమర్శలు వచ్చేవి. కానీ.. అలాంటి విమర్శలకు ఇప్పుడు ఆస్కారం లేకుండాపోయింది.

పార్టీ ఫుటేజీ ఇవ్వకపోవడం వల్లనే.. ముందు ముందు ఇలాంటివి జరగకుండా జగన్ భద్రత కోసం ఏర్పాటు చేస్తున్నాం అని పోలీసులు అంటున్నారు. మొత్తానికి జగన్ చుట్టూ పోలీసు నిఘా పెరగడానికి.. ఆయన సొంత అనుచరులే మార్గం సుగమం చేసినట్టుగా అయింది.

18 Replies to “జగన్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాల నిఘా!”

  1. ఇప్పుడేంటి..

    కెమెరాలు పెట్టి.. లైవ్ ఇస్తారా మాకు ఆ దరిద్రాన్ని ..

  2. దారిని పోయే మూళ్ళ కంపనీ ఎవడో తగిలించు కున్నాడు అంట .. సామెత ..

  3. ఎహె పిచ్చోడా..ఇది అంతా అన్న ప్లాన్ లో ఒక భాగం …దెబ్బ కి టీడీపీ కి మైండ్ బ్లాక్ అయిపోయింది

  4. అంతా అన్న ప్లాన్ లో ఒక భాగం …దెబ్బ కి టీడీపీ కి మైండ్ బ్లాక్ అయిపోయింది

  5. ప్రక్కనున్న సలహాదారులను మార్చుకోరా నాయనా వినడు కదా . వాడికి ఎలాగూ బుర్రలేదు, సలహాదారులకి కూడా లేక పోతే ఎలా?

  6. ఆయనకు భద్రత ఇచ్చేరు ఏ బాబాయ్ లాంటి అనుకోని సంఘటన జరిగిన అది చంద్రబాబు గారి ఖాతాలోకో పవన్ గారి ఖాతాలోకో వేసేస్తారు ఈయనకు అనేకమంది శత్రువులు ఉండబట్టే అంత ఫెన్స్ వేసుకొన్నాడు అందుకే పోలీస్ లు జాగ్రత్తలు తీసుకొన్నారు కనీసం ఏ సంఘటన జరిగిన ఇంట్లో వాళ్ళో వీధిలో వాళ్ళో అన్నది స్పష్టత ఉంటది జనాలకు కూడా క్లారిటీ ఉంటుంది

  7. అవును మరి ఎలాన్ మస్కో, బిల్ గేట్స్ వస్తున్నట్టు హడావుడి చెయ్యకు

  8. ఇప్పుడు లంగా నీ ముఖ్నం మీద కప్పుకుని వెళతాడు ఏమో ప్యాలస్ పులకేశి, గుర్తు పట్టకుండా.

    అసలే స్ర్క్రీజీఫినియా అనే మెంటల్ జబ్బు వలన రాత్రి పూట లేచి పిచ్చి కేకలు వేస్తాడు అని అంటారు.

  9. 3AM కి విన్యాసం ప్యాలస్ లోకి రోజు వెళ్ళడం బయట వాళ్ళకి కుండా వాళ్ళు ఏదో పాపం సీసీటీవీ ఇవ్వలేదు

    పుసుక్కున మీరు ఇలా పెట్టేస్తే ఎలా.

    చూడండి, మన ప్యాలస్ పులకేశ గంజాయి ముఠా ఆ ప్రభుత్వం వాళ్ళు పెట్టిన సీసీటీవీ నింకూడ ఏదో రకంగా పని చేయకుండా చేస్తారు, కొన్నాళ్ళు లో.

    గతంలో ఖాకీ పెద్ద గా చేసిన అతను అసలే కులగజ్జి వలన అప్పట్లో పదవి పొందిన ప్యాలస్ పని మనిషి.

    నేరస్తుల వేలిముద్ర వున్న కంప్యూటర్ లు పని చేయ కుండా చేశాడు , అప్పట్లో. ఇప్పుడు ఏమో చేస్తాడియో.

  10. దండుపలేము దంపతులు తమ ప్యాలస్ లో పండించిన గం*జాయి నీ ఎండబెట్టి , దంచు పొట్లాలు కట్టి, ప్యాలస్ లో పొట్లం ఇంత లెక్కన అమ్ముతూ వుంటారు. ఆ విషయం తెలియకుండా సీసీటీవీ ఆపేసారు.

Comments are closed.