ఉచిత ల‌బ్ధిపై .. సుప్రీం సంచ‌ల‌న కామెంట్స్‌!

సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌ను దేశాభివృద్ధిలో ఏ విధంగా భాగ‌స్వామ్యుల్ని చేయ‌గ‌లుగుతున్నార‌ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది.

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై భిన్నాభిప్రాయాలున్నాయి. రాష్ట్ర ఖ‌జానాలోని సొమ్ముతో పాటు అప్పులు చేసి మ‌రీ సంక్షేమ ప‌థ‌కాల‌కే ఖ‌ర్చు చేయ‌డంతో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌ల్ని ప్ర‌భుత్వాలు విస్మ‌రిస్తున్నాయ‌నే విమ‌ర్శ బ‌లంగా వుంది. ఈ నేప‌థ్యంలో సంక్షేమ ప‌థ‌కాల చాటున ఉచిత ల‌బ్ధి క‌లిగించ‌డంపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిరాశ్ర‌యులైన వాళ్ల‌కు ఆశ్ర‌యించే క‌ల్పించే పిటిష‌న్‌పై విచార‌ణ‌లో భాగంగా జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌, జ‌స్టిస్ అగ‌స్టిన్ జార్జ్ మాసిహ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఉచితాల‌ను అందించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. ఉచితంగా రేష‌న్‌, ఆర్థిక ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు ప‌ని చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డాన్ని సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది.

అయితే సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌ను దేశాభివృద్ధిలో ఏ విధంగా భాగ‌స్వామ్యుల్ని చేయ‌గ‌లుగుతున్నార‌ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం అన్నీ ఉచితంగా ఇస్తామంటూ ప్ర‌క‌టించ‌డాన్ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం త‌ప్పు ప‌ట్టింది. అయితే ఉచిత ప‌థ‌కాల‌పై ఎన్నిక‌ల సంఘం ప‌రిశీలిస్తోంద‌ని ఈసీ త‌ర‌పున న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇదే సంద‌ర్భంలో ఉచిత ప‌థ‌కాల అమ‌లుపై ఎలాంటి ఆదేశాల్ని న్యాయ‌స్థానం ఇవ్వ‌లేదు. విచార‌ణ‌ను ఆరు వారాలకు వాయిదా వేశారు.

6 Replies to “ఉచిత ల‌బ్ధిపై .. సుప్రీం సంచ‌ల‌న కామెంట్స్‌!”

  1. పెద్ద పెద్ద ఆర్థికనేరగాళ్లకు BAILఆశ్రయం కల్పించి, లక్షలకోట్ల రుణాలను మాఫీ చేస్తున్నప్పుడు నోరు రాదని జడ్జీ తెలుసు. విజయమాల్యా ను అరెస్టు చేయమని ఎంత మొత్తుకున్నా వినలేదు. నీరవ్ మోడీ కి మద్దతుగా సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జీ శ్రీ కట్జూ లండన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.45,000 crores loan మాఫీ-అనీల్ అంబానీ మనదేశంలోనే ఉన్న, జైల్లో పెట్టలేరు. జడ్జీలకు భయం ఎక్కువ. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి పేదవాళ్ళపై వెటకారంతో ఎగరడం, సంక్షేమం ఫై ఏడవటం బాగా ఎక్కువ.

  2. ఆర్థికనేరగాళ్లకు ఆశ్రయం కల్పించి, లక్షలకోట్ల రుణాలను మాఫీ చేస్తున్నప్పుడు నోరు రాదని తెలుసు. విజయమాల్యా ను అరెస్టు చేయమని ఎంత మొత్తుకున్నా వినలేదు.

Comments are closed.