విశ్వంభర.. మరింత వెనక్కి?

విశ్వంభర డిజిటల్ అమ్మకాలు ఇప్పటి వరకు జరగలేదు. బేరాలు సాగుతున్నాయి. నిర్మాతలు 60 ల దగ్గర వుంటే ఓటిటి సంస్థలు 30 ల దగ్గర వున్నారు.

మెగాస్టార్ తో యువి సంస్థ నిర్మిస్తున్న సినిమా విశ్వంభర. మూడు వంతుల సీజీ వర్క్ మీద ఆధారపడిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు. రెండు పాటలు మినహా మిగిలిన సినిమా అంతా పూర్తయింది అని అంటున్నారు. మే 9 విడుదల అంటున్నారు. కానీ.. కానీ సినిమా జూన్ లో విడుదలవుతుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. కల్కి సినిమా విడుదలైన జూన్ 27 కు విశ్వంభర విడుదల ప్లాన్ చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

జూన్ 9న నితిన్ తమ్ముడు విడుదలయ్యే అవకాశం వుంది. విశ్వంభర వెనక్కు వెళ్లడానికి కారణం డిజిటల్ రైట్స్, వాళ్లు స్లాట్ ఇవ్వడం అనేవి వుంటాయి. వీళ్లకు రేటు నచ్చాలి. వాళ్లకు స్లాట్ వుండాలి. ఇవన్నీ మ్యాచ్ అయితేనే సినిమా విడుదల అనేది ఈ రోజుల్లో సాధ్యం. విశ్వంభర డిజిటల్ అమ్మకాలు ఇప్పటి వరకు జరగలేదు. బేరాలు సాగుతున్నాయి. నిర్మాతలు 60 ల దగ్గర వుంటే ఓటిటి సంస్థలు 30 ల దగ్గర వున్నారు.

మరి అందువల్లే కావచ్చు. సినిమాను జూన్ మూడో వారంలో విడుదల చేస్తారు అనే టాక్ వినిపిస్తోంది. మే 9 డేట్ కు నితిన్ తమ్ముడు సినిమాను విడుదల చేసే ఆలోచనలు జరుగుతున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత ఆ సినిమాకు.

4 Replies to “విశ్వంభర.. మరింత వెనక్కి?”

Comments are closed.