తిట్టుకున్న ద‌ళిత నేత‌, తాడిప‌త్రి అర్బ‌న్ సీఐ

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రికి చెందిన ద‌ళిత నాయ‌కుడు రాంపుల్ల‌య్య‌, అర్బ‌న్ సీఐ సాయిప్ర‌సాద్ తీవ్ర‌స్థాయిలో తిట్టుకున్నారు.

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రికి చెందిన ద‌ళిత నాయ‌కుడు రాంపుల్ల‌య్య‌, అర్బ‌న్ సీఐ సాయిప్ర‌సాద్ తీవ్ర‌స్థాయిలో తిట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అస‌లు వివాదం ఏంటి? వీళ్ల మ‌ధ్య‌లోకి తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఎందుకొచ్చారు? త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకుందాం.

తాడిప‌త్రి అర్బ‌న్ సీఐ సాయిప్ర‌సాద్‌కు ఒక వ్య‌క్తి ఫోన్ చేశారు. త‌న పేరు రాంపుల్ల‌య్య అని ప‌రిచ‌యం చేసుకున్నారు. త‌న‌కు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి సెల్‌నంబ‌ర్ కావాల‌ని సీఐని అడిగారు. మీరెక్క‌డి నుంచి ఫోన్ చేస్తున్నార‌ని సీఐ ప్ర‌శ్నించారు. తాడిప‌త్రి అంబేద్కర్ కాల‌నీ నుంచి ఫోన్ చేస్తున్న‌ట్టు వివ‌రించారు. త‌న‌ను జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి బెదిరిస్తున్నార‌ని, తన క‌థేంటో చూస్తామ‌ని అంటున్న‌ట్టు సీఐకి వివ‌రించారాయ‌న‌.

ఇత‌రుల సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేశార‌ని, జేసీకి తాను కాల్ చేస్తుంటే, రిసీవ్ చేసుకోలేద‌ని, మీకు ఫిర్యాదు చేసినా కేసు పెట్ట‌ర‌ని అత‌ను సీఐతో అన్నారు. తాడిప‌త్రి నివాసినంటూ, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి సెల్ నంబ‌ర్ అడ‌గ‌డంతో సీఐకి అహం దెబ్బ‌తింది. తానెవ‌రిని అనుకుంటున్నావ‌ని రాంపుల్ల‌య్య‌ను సీఐ ప్ర‌శ్నించారు. తాడిప‌త్రి అర్బ‌న్ సీఐ క‌దా అని రాంపుల్ల‌య్య అన్నారు.

ఔనంటూ, తానేమీ నీ సేవ‌కుడిని కాద‌ని అర్బ‌న్ తీవ్ర స్వ‌రంతో అన్నారు. మ‌రెవ‌రు? అని రాంపుల్ల‌య్య రెచ్చ‌గొట్టిన‌ట్టు మాట్లాడ్డంతో సీఐకి చిర్రెత్తుకొచ్చింది. రాంపుల్ల‌య్య‌పై తీవ్రంగా ఆగ్ర‌హించారు. స‌ర్వెంట్ కాక‌పోతే, మీరెవ‌రని రాంపుల్ల‌య్య నిల‌దీశారు.

వంద‌లాది మందితో పోటీ ప‌డి ఉద్యోగం సాధించాన‌ని, కూలి చేస్తుంటే జీతం ఇస్తున్నార‌ని సీఐ అన్నారు. అదే, మీకు ఇస్తున్న కూలి ఎవ‌రి సొమ్ము అని రాంపుల్ల‌య్య నిల‌దీసిన‌ట్టుగా మాట్లాడారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగింది. రేయ్ అంటే రేయ్ అని తిట్టుకున్నారు.

తాను అనంత‌పురంలో ఉన్నాన‌ని, లోకేష‌న్ షేర్ చేస్తాన‌ని, ద‌మ్ముంటే రా తేల్చుకుందాం అని ద‌ళిత నాయ‌కుడు రాంపుల్ల‌య్య స‌వాల్ విసిరారు. తాడిప‌త్రికి రా …నీ అంతు చూస్తా అని సీఐ బెదిరించారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అనంత‌పురం ఎస్పీ జ‌గ‌దీష్ విచార‌ణ‌కు ఆదేశించారు.

3 Replies to “తిట్టుకున్న ద‌ళిత నేత‌, తాడిప‌త్రి అర్బ‌న్ సీఐ”

  1. ఇక్కడ ఎవరొ SI కి కాల్ చెసారు! ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నడు, అయన నుంబర్ కావాలి అని ఆ వ్యక్తి SI ని అడిగాడు!

    బదిరిస్తె వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని SI చెప్పాడు. కాదు నాకు ప్రభాకర్ రెడ్డి నంబెర్ కావలి, నెను ఫొనె చెస్త్ ఎత్తటం లెదు అని చెప్పాదు

    .

    నువ్వు ఫొనె చెస్తె అయన ఎత్తటం లెదు అంటె అయన నుంబెర్ నీ దగ్గర ఉన్నట్టెగా? మరి SI కి కాల్ చెసి ఆయ్యన్ని గెలకటం దెనికి?

    ఇక్కడ SI ఉన్నది అందరి నుంబెర్లూ రాసుకొని, ఎవరన్నా కాల్చెసి అడిగితె వాళ్ళకి ఇవ్వటనికా ఉంది. SI కి కొంపం వచ్చి నెను నీ సర్వెంట్ ని కాదు అన్నాడు! ఇలా గొడవ మొదలు అయ్యింది.

    .

    ఆ సంభషనలొ కులం ప్రస్తావన రాలెదు! మరి అసలు ఇందులొ కులం ఎక్కడ నుండి వచ్చింది? ఎదొ SI తొ గొడవ పడాలి అన్నట్టు ఉంది.

  2. సంభాషణలో సీఐ తప్పు ఏమి లేదు… తను క్లియర్ గా చెప్పాడు వచ్చి కేసు పెట్టు అని

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.