రఘురామ‌కు న్యాయం అనుమాన‌మే!

గ‌తంలో ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఎంపీగా ఉన్న‌ప్పుడు ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి, ఆ రాత్రి త‌నను చిత‌క్కొట్టిన‌ట్టు బాధితుడు ప‌లుమార్లు వాపోయారు. కూట‌మి స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత నాటి ఘ‌ట‌న‌పై ర‌ఘురామ ఫిర్యాదు చేయ‌డం, కేసు…

గ‌తంలో ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఎంపీగా ఉన్న‌ప్పుడు ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి, ఆ రాత్రి త‌నను చిత‌క్కొట్టిన‌ట్టు బాధితుడు ప‌లుమార్లు వాపోయారు. కూట‌మి స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత నాటి ఘ‌ట‌న‌పై ర‌ఘురామ ఫిర్యాదు చేయ‌డం, కేసు న‌మోదు చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఆ కేసులో ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోద‌ర్ ప్ర‌త్యేక విచార‌ణాధికారి. ఈ కేసులో కీల‌క సూత్ర‌ధారిగా భావిస్తున్న సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజ‌య్‌పాల్‌ను ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలు విచారించారు.

ఒంగోలులో బుధ‌వారం కూడా ఆయ‌న్ను విచారించారు. త‌న‌కేదీ గుర్తు లేద‌న్న మాట త‌ప్ప‌, ఇంకో సంగ‌తి బ‌య‌టికి రావ‌డం లేదు. అప్రూవ‌ర్‌గా మారితే అన్ని ర‌కాలుగా అండ‌గా వుంటామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌లోభ‌పెడుతోంద‌ని వార్త‌లొస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ విజ‌య్‌పాల్ స‌సేమిరా అంటున్నార‌ని తెలిసింది. ఈ కేసులో విజ‌య్‌పాల్ చెప్పేదాన్ని బ‌ట్టి ర‌ఘురామ కేసు ఆధార‌ప‌డి వుంది.

త‌న‌పై భౌతికంగా దాడి చేసిన సీఐడీ సిబ్బందిపై ఎలాగైనా చ‌ట్ట‌ప‌రంగా శిక్ష ప‌డేలా చేయాల‌ని ర‌ఘురామ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కానీ ప‌రిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. గ‌తంలోని విచార‌ణాధికారిని మార్చి, ప్ర‌త్యేక విచార‌ణాధికారిగా దామోద‌ర్‌ను నియ‌మించినా, కేసులో పురోగ‌తి క‌నిపించ‌డం లేదు. దీంతో ప్ర‌భుత్వానికి ఏం చేయాలో అంతుచిక్క‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

కేసు విచార‌ణ ర‌ఘురామ‌కు కాసింత నిరుత్సాహం క‌లిగించేలా వుంది. కూట‌మి స‌ర్కార్ రాగానే, త‌నకు న్యాయం జ‌రుగుతుంద‌ని ర‌ఘురామ ఆశించిన‌ట్టున్నారు. అయితే సీఐడీ రిటైర్డ్ అధికారి విజ‌య్‌పాల్ విచార‌ణ‌లో స‌మాధానాలు ర‌ఘురామ‌కు న్యాయం జ‌రిగేలా లేవు. మున్ముందు ఏమ‌వుతుందో చూడాలి.

10 Replies to “రఘురామ‌కు న్యాయం అనుమాన‌మే!”

  1. న్యాయం జరగడం అంటే.. కొట్టినవాణ్ణి తిరిగి కొట్టడం కాదు..

    ఏ అధికారం చూసుకుని రెచ్చిపోయాడో.. ఆ అధికారాన్ని కూలగొట్టే ప్రక్రియ లో RRR కష్టం ఎంతో కొంత ఉంది..

    ఇప్పుడు జగన్ రెడ్డి అసెంబ్లీ కేసి చూడాలన్నా భయపడేలా చేసాడు..

    ఇంకా జగన్ రెడ్డి పతనం కొనసాగుతుంది.. చేసిన ఏ పాపం ఊరకే పోదు..

    అధికారం చూసుకుని ఎగిరెగిరి పడటం జగన్ రెడ్డి కి అలవాటు.. ఆచి తూచి దెబ్బ కొట్టడం చంద్రబాబు రాజకీయం..

  2. మా ప్రియతమ నాయకుడు లెవె-నన్న ఎమ్మెల్యే గా ప్రామాణస్వీకరం చెయ్యటానికి అసెంబ్లీ కి వచ్చినప్పుడు ఆర్ ఆర్ ఆర్ వెళ్లి భుజం మీద చెయ్యి వేసి చెవిలో అమ్మనా బూతులు తిట్టాడో ఆరోజే ఆయనికి న్యాయం జరిగిపోయింది.…

    .

    ఎనీథింగ్ఎ ఆఫ్టర్ ఇస్ జస్ట్ ఎ బోనస్.

  3. మా ప్రియతమ నాయకుడు @-#లెవె-నన్న ఎమ్మెల్యే గా ప్రామాణస్వీకరం చెయ్యటానికి అసెంబ్లీ కి వచ్చినప్పుడు ఆర్ ఆర్ ఆర్ వెళ్లి భుజం మీద చెయ్యి వేసి చెవిలో అమ్మనా బూతులు తిట్టాడో ఆరోజే ఆయనికి న్యాయం జరిగిపోయింది.…

    .

    ఎనీథింగ్ఎ ఆఫ్టర్ ఇస్ జస్ట్ ఎ బోనస్.

  4. మా-ప్రియతమ-నాయకుడు-లెవె-నన్న-ఎమ్మెల్యే గా ప్రామాణస్వీకరం-చెయ్యటానికి-అసెంబ్లీ-కి-వచ్చినప్పుడు ఆర్ ఆర్ ఆర్ వెళ్లి-భుజం-మీద-చెయ్యి-వేసి-చెవిలో అమ్మనా-బూతులు-తిట్టాడో-ఆరోజే-ఆయనికి-న్యాయం-జరిగిపోయింది.…

    .

    ఎనీథింగ్ ఆఫ్టర్ ఇస్ జస్ట్ ఎ బోనస్.

    1. అవి భూతులు అయి ఉండవు లెండి .. జస్ట్ ఎలా ఉన్నారు అని అడిగిన చాలు .. అప్పటి పరిస్థితి అలాంటిది ..

      1. కస్టడీ లో కొట్టి, అయిదేళ్లు సొంత వూరికి కూడా రానివ్వనోడిని ఎలా ఉన్నారు అని అడిగి చాన్సే లేదు సర్..అందులో ఆర్ ఆర్ ఆర్

  5. డిప్యూటీ స్పీకర్ అయ్యారు కదా … అధ్యక్ష అని పిలవలేక ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు … ఇంకేం న్యాయము కావాలి ఆయనికి ..

  6. అయిదేళ్లపాటు జనాలు నరకం అనుభవించారు….ఆంధ్రకు అదో పీడ…మర్చిపోవాలన్నా మర్చిపోలేని నరకం…

Comments are closed.