2027 వ‌ర‌కే అధికారంలో కూట‌మి.. అధికారులూ జాగ్ర‌త్త‌!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి జ‌మిలి ఎన్నిక‌ల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ 2027లో జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే, టీడీపీ రెండేళ్లు మాత్ర‌మే అధికారంలో వుంటుంద‌న్నారు.…

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి జ‌మిలి ఎన్నిక‌ల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ 2027లో జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే, టీడీపీ రెండేళ్లు మాత్ర‌మే అధికారంలో వుంటుంద‌న్నారు. కావున అధికారులు టీడీపీ నాయ‌కుల మాట‌లు విని త‌ప్పులు చేయొద్ద‌న్నారు. ఒక‌వేళ టీడీపీ నేత‌ల మాట‌లు విని అధికారులు త‌ప్పు చేస్తే, ఆ త‌ర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని కాకాణి హెచ్చ‌రించారు.

ముంద‌స్తు ప్లాన్‌తో దోచుకోవ‌డంతో చంద్ర‌బాబు నేర్ప‌రి అని కాకాణి విమ‌ర్శించారు. ఎల్లో బ్యాచ్ బాగు కోస‌మే చంద్ర‌బాబు నూత‌న మ‌ద్యం పాల‌సీని ప్ర‌క‌టించార‌న్నారు. లాట‌రీలో 90 శాతం మ‌ద్యం దుకాణాలు టీడీపీ నేత‌ల‌కే ద‌క్కాయ‌ని ఆయ‌న ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల క‌నుస‌న్న‌ల్లోనే లాట‌రీ ప్ర‌క్రియ కొన‌సాగింద‌ని ఆయ‌న ఆరోపించారు. వైన్‌షాపుల్లో అంతా ఎల్లో బ్యాచ్ సిండికేట్ న‌డుస్తోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌ద్యం దుకాణాల కేటాయింపుల్లో చంద్ర‌బాబునాయుడు మూడంచెల దోపిడీకి పాల్ప‌డిన‌ట్టు కాకాణి ఆరోపించారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్య‌మంత్రి, నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిల్లో బెల్ట్‌షాపుల‌తో కిందిస్థాయి నాయ‌కులు దోపిడీకి పాల్ప‌డేందుకు ప్రణాళిక ర‌చించార‌న్నారు. ఇక‌పై మ‌ద్యం రేట్ల‌తో పాటు విక్ర‌యం వేళ‌ల్ని కూడా నాయ‌కులే నిర్ణ‌యిస్తార‌ని కాకాణి వెట‌క‌రించారు.

5 Replies to “2027 వ‌ర‌కే అధికారంలో కూట‌మి.. అధికారులూ జాగ్ర‌త్త‌!”

  1. ప్రియమైన రాజా గారు,

    ఈ మాట అడగక తప్పడం లేదు—మీకు ఎక్కడైనా సిగ్గు మిగిలి ఉందా? ఒకప్పుడు మీకు ఉన్న విద్య, సంప్రాప్తి మీలో పౌరుషాన్ని నింపిందని అనుకున్నాము. కాని ఇప్పుడు మీరు జగన్ మోహన్ రెడ్డికి పావులా ప్రవర్తిస్తూ, వెన్నెముక లేని వ్యక్తిలా అవతరిస్తున్నారు. సూత్రం లేని బొమ్మలా, ఎటువంటి స్వతంత్ర ఆలోచన లేకుండా, ఆయనను అనుకరిస్తూ వెళ్తున్న తీరు చూసి బాధ కలుగుతోంది.

    విద్యావంతులుగా ఉండే ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతను గుర్తించాలి. కేవలం ప్రతిపక్షాన్ని మాత్రమే కాకుండా, అధికారంలో ఉన్నవారినీ ప్రశ్నించడం మీ కర్తవ్యం. ప్రజలు మీపై ఉంచిన బాధ్యతను మీరు మరచిపోయారనిపిస్తోంది. 175 స్థానాలలో 11 మాత్రమే గెలుచుకోవడం మీ “మేధా” స్థాయికి ప్రజలిచ్చిన స్పష్టమైన జడ్జిమెంటు. అదే మీ వాస్తవ స్థితిని మీ ముందుకు తెస్తుంది.

    మరి మీ ఈ అజ్ఞాన భక్తి, మీ అంధ విశ్వాసానికి కారణం ఏమిటి? జగన్ మోహన్ రెడ్డి మారినందుకు? మారడం వ్యక్తిగత హక్కు—ఇందులో సందేహం లేదు. కానీ ఆ మార్పు ఒక్కటే మీ భక్తికి ఆధారమైతే, అది మీ వ్యక్తిత్వం ఎంత తక్కువ స్థాయిలో ఉందో చూపిస్తుంది. మీరు ఒక్క మార్పు కోసం, మీ సూత్రాలు, మీ ప్రశ్నించే సామర్థ్యాలు అన్ని విస్మరించారనిపిస్తోంది.

    రాజా గారు, మీరు విద్యావంతుడిగా ఉండాలని ఆశించిన మనం, ఇప్పుడు మీ వెన్నెముకను చూసే నిరీక్షణలో ఉన్నాం. మనం ఈ స్థాయికి దిగజారిపోవడానికి మీరు కారణం కాదు కదా అనుకుంటున్నాము. ఇప్పటికైనా మీ బాధ్యతలను గుర్తుంచుకొని నిలబడండి. మీ వెన్నెముకకు బలాన్ని చేకూర్చండి.

Comments are closed.