ఫస్ట్ లుక్ లేదు.. మేకింగ్ వీడియో మాత్రమే

ఈమధ్య సాయిదుర్గతేజ్ బయట ఎక్కడా కనిపించలేదు. అతడి సినిమా కూడా వచ్చి చాన్నాళ్లయింది. బ్రో మూవీ తర్వాత మళ్లీ కనిపించలేదు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత, అప్పటికే అంగీకరించిన సినిమా సెట్స్ లో జాయిన్…

ఈమధ్య సాయిదుర్గతేజ్ బయట ఎక్కడా కనిపించలేదు. అతడి సినిమా కూడా వచ్చి చాన్నాళ్లయింది. బ్రో మూవీ తర్వాత మళ్లీ కనిపించలేదు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత, అప్పటికే అంగీకరించిన సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఆ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు.

ఇప్పుడీ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. సాయితేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా, భారీ సెట్స్ తో ఈ మూవీ వస్తోందనే విషయం మేకింగ్ చూస్తే అర్థమౌతోంది. అయితే అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీడియో చివర్లో సాయితేజ్ ను కండలు తిరిగిన దేహంతో వెనక నుంచి చూపించారు

ఈ సినిమా కోసం అతడు సిక్స్ ప్యాక్ లోకి మారినట్టు వీడియో చూస్తుంటే అనిపిస్తోంది. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా అతడు దాదాపు అదే లుక్ లో ఉన్నాడు.

శారీరకంగా, డిక్షన్ పరంగా మరింత మెరుగ్గా కనిపించేందుకు తను టైమ్ తీసుకుంటున్నానని సాయితేజ్ ఆమధ్య ప్రకటించాడు. ఈ గ్యాప్ లో అతడు ఇలా ఫిట్ గా తయారయ్యాడా.. లేక సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా వాడారా అనేది తేలాల్సి ఉంది.

ఈ సంగతి అటుంచితే సినిమా సెటప్ మాత్రం బాగుంది. హనుమాన్ నిర్మాతల నుంచి వస్తున్న మూవీ కావడం, విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయితేజ్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు బాగా ఉన్నాయి. ఎటొచ్చి ఈరోజు సినిమా టైటిల్ ప్రకటిస్తారని అంతా ఎదురుచూశారు. టైటిల్ కాదు కదా, సాయితేజ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకుండానే ముగించారు.

4 Replies to “ఫస్ట్ లుక్ లేదు.. మేకింగ్ వీడియో మాత్రమే”

Comments are closed.