భోగస్ ఓట్లు అంటూ మొదలెట్టిన కూటమి!

భోగస్ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోందని టీడీపీ కూటమి అభ్యర్ధి మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ అంటున్నారు. ఆయన అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. ఇప్పటిదాకా ఈ ఆరోపణలు టీడీపీ సహా…

భోగస్ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోందని టీడీపీ కూటమి అభ్యర్ధి మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ అంటున్నారు. ఆయన అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. ఇప్పటిదాకా ఈ ఆరోపణలు టీడీపీ సహా ఇతర పార్టీల నేతలు చేశారు. జనసేన నుంచి మాజీ మంత్రి తొలిసారిగా ఈ ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భోగస్ ఓట్లతోనే వైసీపీ గెలిచిందని ఆయన విమర్శించారు.

చాలా చోట్ల డబుల్ ఎంట్రీలు ఒకే ఇంటి నంబర్ తో ఉన్నాయని ఆయన అంటున్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఇదిలా ఉంటే ఈ నెల 15వ తేదీ వరకూ కొత్త ఓటర్లకు ఎన్నికల సంఘం అవకాశం ఇస్తోంది. ఆ తరువాత ఓటర్ల తుది జాబితా విడుదల అవుతుంది. మరో నెల రోజులలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో కూడా భోగస్ ఓట్లు అంటూ ఆరోపణలు చేయడంతో దీని మీద అంతా తర్కించుకుంటున్నారు.

గతంలో టీడీపీ హయాంలో దొంగ ఓట్లు ప్రతీ నియోజకవర్గంలో ఉన్నాయని తాము ఫిర్యాదు చేశామని దానికి ప్రతిగా భోగస్ ఓట్లను తెస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. పోలింగునకు కౌంట్ డౌన్ అవుతున్న సమయంలో భోగస్ ఓట్లు అని టీడీపీ కూటమి చేస్తున్న ఈ ఆరోపణల మీద ఈసీ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.