కూటమి సర్కార్‌కు మద్యం వ్యాపారులు డెడ్‌లైన్ విధించారు. మద్యం పాలసీలో చెప్పిన ప్రకారం కమీషన్ ఇవ్వకపోతే, దుకాణాలు బంద్ చేస్తామని వారు హెచ్చరించడం గమనార్హం. గతంలో వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారం తానే చేసింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. అంతేకాదు, మందుబాబులు కోరుకున్న బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేసి, వారి ఆగ్రహానికి గురైంది.
కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాల్ని అప్పగించింది. టెండర్ల ప్రక్రియ ద్వారా దాదాపు రూ.2 వేల కోట్లు సంపాదించుకుంది. ఇంత వరకూ బాగుంది. అయితే మద్యం పాలసీలో 20 శాతం కమీషన్‌ను మద్యం వ్యాపారులకు ఇస్తామని చెప్పారని, కానీ 10 శాతానికి మించడం లేదని వాళ్లంతా ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైన్‌షాప్ యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ (శుక్రవారం) సాయంత్రం లోపు 20 శాతం కమీషన్ ఇస్తామనే హామీపై సానుకూల ప్రకటన చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఒకవేళ ప్రభుత్వం తన మాటపై నిలబడకపోతే శనివారం నుంచి మద్యం దుకాణాలు బంద్ చేస్తామని ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామం చోటు చేసుకున్న దాఖలాలు లేవు.
మద్యం వ్యాపారంలో పెద్దగా ఆదాయం లేకపోగా నష్టాలు చవి చూడాల్సి వస్తోందని వాళ్లంతా లబోదిబోమంటున్నారు. పోలీసులు, రాజకీయ నాయకులకు కమీషన్లు పోనూ, ఇక తమకు మిగిలేది గుండు సున్నా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే ఇక వ్యాపారం చేయడం వృథా అని వాళ్లంతా తెగేసి చెబుతున్నారు.
మందుబాబుల ఓట్లతో గెలిచిన కూటమికి మందుషాపులోళ్ళ సెగనా? ఏమీ కాదులే!
vallu close chesthe aadayam raadu ha ha
Ap sarcar ki chippe gathi inka.
bongulo antha isthe pakka states lo inka cheap..it’s better to buy there…anyway all drinkers have cars, just bring it once..
cbn gaanikj chippe gathi
Close them. Who cares
CBN cares ha ha .. aadyam raakunte pensions kooda ivvaledu
మందు బాబు ల సంగతి మా బాబు గారు చూసుకుంటారు. మీకెందుకు మధ్యలో పైశాచికనందం.
మరో సారి ఆ మాటెత్తకుండా సంపూర్ణ మద్య నిషేధం విధిస్తే వాళ్ళ తిక్క కుదురుతుంది