సత్యవాక్కు: కమలదళంలోనూ దందారాయుళ్లు!

ఆదినారాయణ యాదవ్ కు చెందిన కారులో.. కొందరు ప్రభాకర్ కు చెందిన భూమి వద్దకు వచ్చి.. అతడిని నిర్బంధించి కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.

భారతీయ జనతాపార్టీ నాయకులు అంటే.. వాళ్లు కాస్త విలువలు పాటిస్తారనే ప్రచారం ఒక వర్గం ప్రజల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు కొన్నిచోట్ల అందుకు ఆధారాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఆ పార్టీవారే ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల పరిస్థితి తెలియదు గానీ.. మిగిలిన చోట్ల.. లిక్కరు దందాలు నడిపించడం, లిక్కరు సిండికేట్లలో భాగంగా ఉండడం, వాటాలు పుచ్చుకోవడం వంటివి.. తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య వాటాలుగా విభజింపబడి సాగుతున్నాయి. కానీ కమలదళంలో కూడా దందారాయుళ్లు తగుమాత్రం ఉన్నారని, తమ మంత్రి అండ చూసుకుని బెదిరింపులకు కబ్జాలకు అవసరమైతే హత్యలకు కూడా వెనుదీయరని తాజా ఉదాహరణలు నిరూపిస్తున్నాయి.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కీలక అనుచరుడు.. సత్యసాయి జిల్లాలోని కియా పరిశ్రమ సమీపంలో విలువైన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించడమే కాదు.. ఆ భూయజమాని తమ మాట వినడం లేదని.. ఏకంగా చంపేయడానికి కూడా పూనుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అక్కడ మునిమడుగు గ్రామ పరిధిలో 1.72 ఎకరాల భూమిని గుంతకల్లుకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి కొనుక్కున్నారు. ఈ భూమికి ఆనుకుని ముదిగుబ్బ మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్ కు చెందిన కంపెనీ భూములున్నాయి. వైసీపీ నేతగా ఉంటూ మండలాధ్యక్షుడు అయిన ఆదినారాయణ యాదవ్.. ఎన్నికలకు ముందు బిజెపి అభ్యర్థి సత్యకుమార్ ప్రాపకంలోకి వచ్చారు. నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్ కు ముఖ్య అనుచరుడిగా చెలామణీ అవుతున్నారు.

ఆదినారాయణ యాదవ్ కు చెందిన కారులో.. కొందరు ప్రభాకర్ కు చెందిన భూమి వద్దకు వచ్చి.. అతడిని నిర్బంధించి కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆదినారాయణ ఫోనులో.. ‘‘ఏరా ఆ భూమిలో పనిచేయొద్దని చెప్పినా వినవా.. చెప్పినట్టు వినకపోతే చంపేస్తా’’ అని బెదిరించినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో ఆదినారాయణ ఫోనులో ‘‘మనకు కావాల్సిన వ్యక్తి వీడే చంపేయండి’’ అని ఆదేశించినట్టుగా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. వారంతా ప్రభాకర్ మీద రాడ్లు, కర్రలతో దాడిచేసి తీవ్రంగా కొడుతుండగా.. సమీప పొలాల్లోని రైతులు గమనించి కేకలు వేయడంతో వారు పారిపోయినట్టు తెలుస్తోంది. పోలీసులు కారును కూడా సీజ్ చేశారు.

భారతీయ జనతా పార్టీ నాయకులు.. కబ్జాలు, దందాలుసాగించడంలో ఇంకా తొలిదశలో మాత్రమే ఉన్నారా? రాష్ట్రవ్యాప్తంగా చెలరేగకుండా.. తమకు బాగా బలం ఉన్నచోట, తమ ఎమ్మెల్యేలు ఉన్నచోట మాత్రమే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారా? క్రమంగా రాష్ట్రమంతా ఇదే ధోరణుల్ని చూపిస్తారా? అనే చర్చలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి.

8 Replies to “సత్యవాక్కు: కమలదళంలోనూ దందారాయుళ్లు!”

  1. ఇలాంటివి 5 ఎళ్ళులలొ ప్రతి రొజు జరిగాయి! అయితె నువ్వు కల్లు మూసుకు కూర్చున్నవ్!

    ఎకంగా పొర్ట్ లు, SEZ లె కాజెసారు!

Comments are closed.