హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ఇలా మొదలైందో లేదో అలా అనారోగ్యానికి గురయ్యారు పవన్. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని, స్పాండిలైసిస్ సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నారని ప్రకటన వచ్చింది.
ఆ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే పవన్ లేచి కూర్చున్నారు. ఏకంగా షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర పూర్తిచేశారు. చకచకా నడుస్తూ ఆలయాలన్నీ కవర్ చేశారు. అవి పూర్తయిన వెంటనే అట్నుంచి అటు మ్యూజికల్ నైట్ ఛారిటీ షోకు కూడా హాజరయ్యారు.
ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. మరి ఇప్పుడేంటి? ఇకనైనా పవన్ షూటింగ్ కు వస్తారా? ఈసారి గతంలో కంటే పెద్ద అడ్డంకి వచ్చి పడింది. అదే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.
మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అవి మొదలైతే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కచ్చితంగా సమావేశాలకు హాజరుకావాల్సిందే. ఓవైపు సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు షూటింగ్ చేస్తే కచ్చితంగా రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కాబట్టి సమావేశాల్లోపు ఈ 4-5 రోజుల్లో ఆయన వీరమల్లు సెట్స్ పైకి రావాలి. లేదంటే తిరిగి సమావేశాలు ముగిసిన తర్వాత మాత్రమే ఆయన షూటింగ్ కు రావాల్సి ఉంటుంది. రెండోది జరిగితే మార్చి 28కి సినిమాను విడుదల చేయడం కష్టం అవ్వొచ్చు.
ఏంటో.. అసెంబ్లీ కి వెళ్ళేవాళ్ళకే ఈ కష్టాలన్నీ..
అసెంబ్లీ ఎగ్గొట్టేసి.. జైళ్ల ను పరామర్శించే వెధవలకు ఏ బాధా ఉండదు.. ఏ కష్టమూ ఉండదు..
30 ఏళ్ళు అధికారం లో ఉండాలనుకొంటారు.. అసెంబ్లీ కి వెళ్లకుండా..
కాల్ బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
Yento sir