హోంమంత్రి అనిత ప్ర‌మాణానికి సిద్ధ‌మా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఎలాగైనా కేసుల్లో పెట్టి, ఇబ్బంది పెట్టాల‌నేది కూట‌మి స‌ర్కార్ ఆలోచ‌న‌. టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో ఇప్ప‌టికే ఆయ‌న అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌కాశం…

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఎలాగైనా కేసుల్లో పెట్టి, ఇబ్బంది పెట్టాల‌నేది కూట‌మి స‌ర్కార్ ఆలోచ‌న‌. టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో ఇప్ప‌టికే ఆయ‌న అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌కాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు నందిగం సురేష్ అనుచ‌రుల‌వ‌ని టీడీపీ ఆరోపిస్తోంది. కేసు కూడా న‌మోదైంది.

బోట్లు బ్యారేజీని ఢీకొట్ట‌డం వెనుక‌ హోంశాఖ మంత్రి అనిత కూడా నందిగం సురేష్‌, త‌ల‌శిల ర‌ఘురాం కుట్ర ఉంద‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో అనిత‌కు నందిగం సురేష్ భార్య బేబిల‌త స‌వాల్ విసిరారు. మీడియాతో బేబిల‌త మాట్లాడుతూ కృష్ణా న‌దిలో కొట్టుకొచ్చిన బోట్ల‌పై త‌న భ‌ర్త పేరు వుందా? అని ప్ర‌శ్నించారు.

త‌న భ‌ర్త‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పిల్ల‌ల‌పై ప్ర‌మాణం చేస్తాన‌న్నారు. హోంమంత్రి అనిత కూడా త‌న పిల్ల‌ల‌పై ప్ర‌మాణం చేసి, త‌న భ‌ర్త‌పై చేసిన ఆరోప‌ణ‌ల్ని నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు.

మాజీ ఎంపీని వాడు, వీడు అంటూ దిగ‌జారి మాట్లాడుతోంద‌ని అనిత‌పై ఆ మె విరుచుకుప‌డ్డారు. హోంమంత్రి త‌న ప‌ద‌విని కాపాడుకునేందుకు త‌న భ‌ర్త‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని ఆమె విమ‌ర్శించారు. టీడీపీ కార్యాల‌యంపై దాడికి సంబంధించి త‌న భ‌ర్త పాత్ర ఉంద‌నేందుకు ఒక్క ఆధార‌మైనా చూపాల‌ని ఆమె డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

10 Replies to “హోంమంత్రి అనిత ప్ర‌మాణానికి సిద్ధ‌మా?”

  1. పోలీస్ లు కోర్టు లు ఎందుకు పిల్లల మీద ప్రమాణాలు చేసుకొంటే పోయే……..

    దరిద్రపు నీచ రాజకీయాలు…….

    పిల్లలను తీసుకోస్తారు మధ్యలోకి……

  2. మహిళలను హోమ్ మంత్రులుగా చేస్తే ఇటువంటి సవాళ్లు తప్పవు..దీనికి వారు సిద్ధంగా ఉండాలి.

  3. ప్రియమైన లోకనాథ రావు గారు,

    మీకు ఎక్కడైనా సిగ్గు ఉందా? మీరు ఎప్పటికప్పుడు ఇతరుల తల్లుల గురించి అశ్లీల పదజాలం వాడుతూనే ఉంటారు. మీరు ఒక గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా ఆశ్చర్యకరం. మీకు మర్యాద అనే భావన కూడా లేదా? మీరు ఎప్పుడూ కులం గురించి మాట్లాడుతారు, ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలపై మీకున్న ద్వేషాన్ని నింపుకొని. ఇది ఎంతలా ఘోరమైన విషయమో మీకు అర్థం అవుతుందా?

    మీరు ఎదుర్కొన్న వ్యక్తుల్లో అతి చెత్తగా ప్రవర్తించే వారిలో మీరు ఒకరు. మీరు ఎవరినైనా రాజకీయంగా మద్దతు ఇవ్వొచ్చు, కాని మానవత్వం గల వ్యక్తిగా ఉండటం మరచిపోకండి. జీవితం కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు. మీలోని ఈ ద్వేషం మీ మనసును మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యాన్ని కూడా కృంగజేస్తుంది. ఈ క్రోధం వదులుకోలేకపోవడం వల్ల మీ చుట్టూ ఉన్న వారంతా ఇబ్బంది పడుతున్నారు.

    మీరెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారో, మీకు కమ్మ మరియు కాపు సామాజిక వర్గాల నుండి ఎప్పుడో ఒక చెడు అనుభవం ఉండవచ్చు. అవారే మీను అశక్తునిగా చూడడం వల్ల మీ ప్రవర్తన మరింత అశ్లీలంగా మారి, మీరు మొత్తంగా ఒక సామాజిక వర్గంపై ద్వేషం పెంచుకున్నారు. మీ లాంటి కొద్దిమంది మినహా, మీ చుట్టూ ఉన్న చాలా మంది మిమ్మల్ని అశ్లీల వ్యక్తిగా చూస్తున్నారు. మీరు ఇలానే ఎందుకు ఉండాలని అనుకుంటున్నారు? ప్రతి సామాజిక వర్గంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కులాధారిత ద్వేషాన్ని పెంచకండి.

    జీవితం చాలా చిన్నది, ఈ ప్రపంచంలో మీకు ఎన్ని రోజులు ఉన్నాయో కూడా తెలియదు. మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ, మంచివాడిగా మారి, మరణానంతరం మంచి గుర్తింపు పొందండి. మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే, మీ కుటుంబ సభ్యులను అడగండి. వారు మీకు ఒక సలహాదారుని ఏర్పాటు చేస్తారు.

Comments are closed.