తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ధైర్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి ఇష్టానుసారం భారీ భవంతులు నిర్మించారు. ఏకంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. దీంతో చాలా చోట్ల అపార్ట్మెంట్లలో మధ్యతరగతి వేతన జీవులు కూడా ప్లాట్లు కొన్నారు. అలాంటి చోట కూల్చివేతలు విమర్శలకు తావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెరువులు, నాలాలు, కుంటలను కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టిన వాళ్లు తమకు తాముగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి చోట ఆక్రమణల్ని క్రమబద్ధీకరించే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా విడిచి పెట్టే ప్రశ్నే లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
తమ హైడ్రా రంగంలోకి దిగితే అన్ని నేలమట్టం అయిపోతాయని రేవంత్‌రెడ్డి హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే సినీ నటుడు నాగార్జున లాంటి సినీ సెలబ్రిటీ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చి వేసిన సంగతి తెలిసిందే. అలాగే రేవంత్‌రెడ్డి సొంత సోదరుడు కొండల్‌రెడ్డి ఇంటిని కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది.
హైదరాబాద్‌లో చెరువులు, కుంటల ఆక్రమణలపై తీవ్ర విమర్శలున్నాయి. అలాంటి చోట భారీ భవంతులు కట్టడంతో వరద వచ్చినప్పుడు నీళ్లలో గడపాల్సిన పరిస్థితి. రాజకీయంగా నష్టం వస్తుందనే చర్చ ఉన్నప్పటికీ, రేవంత్ మాత్రం వెనక్కి తగ్గకపోవడం విశేషం.
అంతా స్క్రిప్టెడ్ డ్రామా..తొందర ఎందుకు ఇక్కడే వస్తుంది అసలు కథ..
Not only BRRS. For us also settlers has to fear and to vote.
పట్టణం వాళ్ళు ఎలాగో ఓట్ వెయ్యలేదు.. ఆయన అండా దండా అంతా పల్లెవారే…
అయితే ఆత్కూర్..లేదంటే ఘనాత్కర్.. తగ్గేదే లే!
vc available 9380537747
ఆయన మగాడ్రా బుజ్జి.
Mari river lo kadutunna Amaravati paristiti??
అది ఆంధ్ర
అదే మా 30 ఇయర్స్ అయితే ఇలా అక్రమ భవనాలుపడేయకుండా వాళ్ల దగ్గర డబ్బులు మింగుతాడు
హే హే హే.. ధైర్యమా.. డ్రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమణల జోలికి పోతే తెలుస్తాది..