రాజ‌గురువు ప‌త్రికే వాపోయే రేంజ్‌లో ఇసుక దోపిడీ!

అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీ స‌భ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇసుక పాల‌సీ బాగా లేద‌ని, ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌చ్చేలా వుంద‌ని ప‌రోక్షంగా అన్నారు. అలాగే మ‌ట్టి దోపిడీ గురించి ఆయ‌న చెబుతుంటే, స్పీక‌ర్ స్థానంలో…

అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీ స‌భ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇసుక పాల‌సీ బాగా లేద‌ని, ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌చ్చేలా వుంద‌ని ప‌రోక్షంగా అన్నారు. అలాగే మ‌ట్టి దోపిడీ గురించి ఆయ‌న చెబుతుంటే, స్పీక‌ర్ స్థానంలో కూచున్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మైక్ క‌ట్ చేశారు. ఇవాళ రాజ‌గురువు ప‌త్రికే వాపోయే రేంజ్‌లో ఇసుక దోపిడీ గురించి క‌థ‌నం రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉచిత ఇసుక అంద‌జేస్తామ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇదిగో ఉచిత ఇసుక అంటూ ఆర్భాటంగా ప్రారంభించారు. పేరులో ఉచితం త‌ప్ప‌, ఎక్క‌డా అందిస్తున్న దాఖ‌లాలు లేవ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబునాయుడి దృష్టికి మీడియా ప్ర‌తినిధులు తీసుకెళ్ల‌గా.. ఏం నేనే ఇంటి ద‌గ్గరికి ఇసుక మోసుకెళ్లాలా? అని ద‌బాయించారు.

ఈ నేప‌థ్యంలో ఉచిత ఇసుక దోపిడీపై టీడీపీ అనుబంధ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇవాళ కూడా రాజ‌గురువు ప‌త్రిక‌లో ప్ర‌భుత్వ ధ‌ర కంటే లారీకి అద‌నంగా రూ.5 వేలు వ‌సూలు చేస్తున్నారంటా రాసుకొచ్చారు. ఉచితం అన్న త‌ర్వాత‌, మ‌ళ్లీ ప్ర‌భుత్వ ధ‌ర అన‌డంతో …ప్ర‌భుత్వ హామీ ఏ మేర‌కు అమ‌లవుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. దానికి తోడు రూ.5 వేలు అద‌నం అంటే ఏ స్థాయిలో దోపిడీ సాగుతున్న‌దో సొంత మీడియా క‌థ‌నాలు చ‌దివితే అర్థ‌మ‌వుతుంది.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చుట్టుప‌క్క‌ల ప‌డ‌వ ర్యాంపుల‌న్నీ గ‌తంలో వైసీపీ హ‌యాంలో సిండికేట్ న‌డిపిన వ్య‌క్తే, నేడు హ‌వా కొన‌సాగిస్తున్నార‌ని పేర్కొన్నారు. గ‌తంలో వైసీపీ నాయ‌కుల‌కు నెల‌కు రూ.11 కోట్లు ఇచ్చేవాడ‌ని ప్ర‌స్తావించారు. ఈ లెక్క‌న ఇంత‌కంటే ఎంతోకొంత ఎక్కువ మొత్తాన్ని కూట‌మి నాయ‌కుల‌కు ముట్ట‌చెబుతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. డ‌బ్బుకు రాజ‌కీయం, కులం, రంగు ఏదీ వుండ‌ద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏది ఏమైనా ఇసుక దోపిడీ మితిమీరింద‌నేది వాస్త‌వం.

15 Replies to “రాజ‌గురువు ప‌త్రికే వాపోయే రేంజ్‌లో ఇసుక దోపిడీ!”

  1. మన స్టేక్షి మాదిరి ఏమిచేసిన బాకాలు ఉదవుగా పత్రికలు. అందరికి నీలా విలువలు ఉండవు అనుకుంటే ఎట్లా?

  2. న్యూస్ వెయ్యకపోతే వెయ్యలేదు అని ఏడుస్తావు..

    వేస్తే అంబంధ పత్రికే వేసిందంటే ఇంకా ఆ అవినీతి ఎంత పెద్దదో అని ఏడుస్తావు..

    .

    ఇటు పోయిన ఏడుపు కామన్..

  3. తప్పును తప్పు కింద మంచిని మంచిగా రాస్తేనే పేపర్ కైనా ఏ మీడియా కైనా వేల్యూ అదే ఈనాడు చేసింది ప్రభుత్వాన్ని మేలుకొలిపింది అందుకే ఆ పత్రిక అన్ని సంవత్సరాలు విజయవంతం గ నడుస్తుంది అన్ని మీడియా లు సాక్షి గ్రేట్ ఆంధ్ర టీవీ 9 లాగ వుండవు కదా

Comments are closed.