టీడీపీ నేత, మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్‌రెడ్డిపై 48 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు గిరిజనులు షాక్ ఇచ్చారు. అసలే కొలికపూడి అంటే సొంత పార్టీలోనే గిట్టని వాళ్లు చాలా మంది ఉన్నారు. టీడీపీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టేలా నిత్యం ఏదో ఒక వివాదాన్ని కొలికపూడి ఉద్దేశపూర్వకంగానే సృష్టిస్తున్నాడని అధిష్టానం పెద్దలు అసహనంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో తిరువూరులోని ఎమ్మెల్యే కొలికపూడి ఇంటికి ఏ.కొండూరు మండలంలోని పలు గిరిజన తండాలకు చెందిన మహిళలు గురువారం వెళ్లారు. పనుల కోసం వెళ్లేవారిని లైంగిక వాంఛలు తీర్చమంటున్నాడని రమేష్‌రెడ్డిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. మహిళలతో నీచంగా ప్రవర్తిస్తున్న రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి ఘాటుగా స్పందించారు. రమేశ్‌రెడ్డి లైంగిక వేధింపులపై ఇప్పటికే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశానని, 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ (శుక్రవారం) ట్విస్ట్ చోటు చేసుకుంది. తిరువూరు మాజీ ఏఎంసి చైర్మన్ అలవాల రమేష్ రెడ్డిపై ఎమ్మెల్యే కొలికపూడి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని గిరిజన యువకులు, మహిళలు ఖండించారు. రమేష్‌రెడ్డి తన దగ్గరకొచ్చినా, పార్టీ కార్యక్రమాల్లో కనిపించినా చెప్పు తెగేదాకా కొడతానని ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని నిరసిస్తూ గిరిజన యువకులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. తిరువూరులో ఎమ్మెల్యే ఇంటి దగ్గర సమావేశం ఉందని, లోన్ల కోసం రావాలని, డబ్బు ఇస్తామంటే వెళ్లామని గిరిజన మహిళలు చెప్పి, కొలికపూడికి షాక్ ఇచ్చారు. అలాగే రమేష్ రెడ్డిపై ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్యేను మహిళలు డిమాండ్ చేశారు.
అసలు తిరువూరులో ఏం జరుగుతున్నదో, ఎందుకిలా అవుతున్నదో టీడీపీ అధిష్టానానికి అర్థంకాని పరిస్థితి. మరీ ముఖ్యంగా టీడీపీ నాయకులతోనే ఎమ్మెల్యేకు గొడవలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కొలికపూడి నోటికొచ్చినట్టు తిట్టడం టీడీపీ శ్రేణులకు కోపం తెప్పిస్తోంది. రమేష్‌రెడ్డి వ్యవహారంలో తప్పెవరిది? అలాగే 48 గంటల్లో రాజీనామా చేస్తాననే బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగడంపై టీడీపీ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
.. తనకు మంత్రి పదవి కావాలని తనదైన శైలిలో అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నాడు.
మొదటిసారి MLA లకి సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చినట్లు లేరు:)
రేపటినుంచి టీడీపీ క్యాడర్ ఈయనను ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు అని వెంటపడాలి అప్పుడు సర్ లైన్ లోనికి వస్తాడు పార్టీ ని ఇబ్బంది పెట్టేవాళ్లను తక్షణం బయటికి పంపించేయాలి
కొన్ని సంవత్సరాల క్రితం కొలికపూడి లక్షలమంది చూస్తున్న టీవీ డిబేట్ లో బీజేపీ విష్ణు వర్ధన రెడ్డిని చెప్పుతో కొట్టాడు. ఆర్జీవి తల తెచ్చిస్తే కోటి రూపాయలు ఇస్తానన్నాడు. అప్పటి ప్రభుత్వం చూస్తూ కూచుంది. దాంతో అతను తాను చాలా గొప్పవాడినని భావించడం మొదలెట్టాడు. ఇప్పుడు ఎం. ఎల్. ఏ. అయ్యాక తన స్థానం ఏమిటో అతనికి అర్థం అయ్యుండాలి. పార్టీలోని ఆధిక్య కులాలని ఛాలెంజ్ చేస్తే అతని గతి అధోగతే అని తెలిసుండాలి. కానీ ఇంకా ఎగిరేగిరి పడుతున్నాడు. ఇప్పుడు అతని అవసరం పార్టీకి తీరిపోయింది కాబట్టి అతన్ని వదిలించుకోవడానికి పార్టీకి నిమిషం చాలు. అతని స్థానం ఆక్రమించడానికి వీర విధేయుడు బాలకోటయ్య రెడీగా ఉన్నాడు.
కొన్ని సంవత్సరాల క్రితం కొలికపూడి లక్షలమంది చూస్తున్న టీవీ డిబేట్ లో బీజేపీ విష్ణు వర్ధన రెడ్డిని చె..ప్పుతో కొ.. ట్టా..డు. ఆర్జీవి తల తెచ్చిస్తే కో..టి రూపాయలు ఇస్తానన్నాడు. అప్పటి ప్రభుత్వం చూస్తూ కూచుంది. దాంతో అతను తాను చాలా గొప్పవాడినని భావించడం మొదలెట్టాడు. ఇప్పుడు ఎం. ఎల్. ఏ. అయ్యాక తన స్థానం ఏమిటో అతనికి అర్థం అయ్యుండాలి. పార్టీలోని ఆధిక్య కు.. లా.. ల..ని ఛాలెంజ్ చేస్తే అతని గతి అధోగతే అని తెలిసుండాలి. కానీ ఇంకా ఎగిరేగిరి పడుతున్నాడు. ఇప్పుడు అతని అవసరం పార్టీకి తీరిపోయింది కాబట్టి అతన్ని వదిలించుకోవడానికి పార్టీకి నిమిషం చాలు. అతని స్థానం ఆక్రమించడానికి వీర విధేయుడు బాలకోటయ్య రెడీగా ఉన్నాడు.