ఈ విషయంలో మాత్రం నిబంధనలు చూపించరు!

ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి 10 శాతం సీట్లు ఉండాల్సిందే అనే నిబంధన ఎక్కడ ఉందో మాత్రం ఆయన చెప్పరు.

జగన్మోహన్ రెడ్డికి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ హోదా ఇవ్వాలా లేదా అనే విషయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలాగా లేదు. ఒకవైపు ఈ హోదా కోసం ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధంగానే తన హక్కును పొందడానికి పోరాడుతుండగా, పాలక కూటమి మాటలు తమాషాగా ధ్వనిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడి హోదా అనేది ఒకరు ఇచ్చేది కాదని… ప్రజలు తిరస్కరించిన తర్వాత తాము ఇవ్వలేమని… ఇలా పాలక కూటమికి చెందినవారు డొంకతిరుగుడుగా అనేక మాటలు చెబుతున్నారు. తాజాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూలింగ్ కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి డిమాండ్‌ను ఎద్దేవా చేస్తూ మంత్రి నారా లోకేష్ విమర్శించారు.

అంతా బాగానే ఉంది. కానీ శాసనసభలో మొత్తం సీట్లలో 10 శాతం మంది ఎమ్మెల్యేల బలం ఉంటే తప్ప ఒక పార్టీకి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వడానికి వీల్లేదు అనే నిబంధన ఎక్కడ ఉందో మాత్రం ఎవరూ చెప్పరు! అంతా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తాము నడుచుకుంటున్నట్లుగా బిల్డప్ ఇచ్చే కూటమి పార్టీలు, ఈ విషయంలో ఇలాంటి నిబంధన ఎక్కడ ఉందో ఎందుకు చూపించలేకపోతున్నాయో ఎవరికీ అర్థం కాని విషయం.

స్పష్టంగా చెప్పాలంటే – ఒక చట్టసభలో ప్రతిపక్ష నేత హోదాతో తమ ప్రత్యర్థి నాయకుడిని గుర్తించడం అనేది సంప్రదాయానికి సంబంధించిన సంగతి. 10 శాతం సీట్లు లేకపోయినా సరే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అనే రూల్ ఎక్కడా లేదు. అదే విధంగా, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి 10 శాతం సీట్లు ఉండి తీరాలి అనే నిబంధన కూడా ఎక్కడా లేదు. ఇరుపక్షాలు తమ తమ వాదనలకు అనుకూలంగా ఉండే ఉదాహరణలు మాత్రమే చెప్పుకుంటూ పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి.

ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీకి ముగ్గురు సభ్యులే ఉన్నప్పటికీ ఆప్ ప్రభుత్వం హోదా ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి అంటారు. అదే సమయంలో, 10 శాతం సీట్లు లేని సందర్భాల్లో ఎప్పుడెప్పుడు హోదా ఇవ్వలేదో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉదాహరణలు కరవు పెడతారు. అంతేతప్ప ఇద్దరూ ‘ఫలానా నిబంధన ప్రకారం..’ అనే మాట ఇప్పటిదాకా అనడం లేదు.

‘60 రోజులు శాసనసభకు రాకపోతే ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుంది’ అనే విషయం చెప్పడానికి రాజ్యాంగంలోని అధికరణలను ఉదాహరణలుగా కోట్ చేసి స్పీకర్ చెబుతారు. కానీ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి 10 శాతం సీట్లు ఉండాల్సిందే అనే నిబంధన ఎక్కడ ఉందో మాత్రం ఆయన చెప్పరు.

ఒక విషయంలో అంతా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చే పాలకపక్షమే – ఈ విషయంలో కూడా నిబంధన ఏదైనా ఉంటే చెప్పాలి కదా… అనేది ప్రజల సందేహం. జగన్మోహన్ రెడ్డి లాజిక్ ప్రకారం, సభలో రెండే పక్షాలు ఉన్నప్పుడు, పాలక కూటమిలో లేని పార్టీని ప్రతిపక్షంగా గుర్తించడానికి ఏమిటి అభ్యంతరం? అనేది కూడా ప్రజల మనసులో మెదులుతున్న మాట. కానీ చంద్రబాబు అండ్ కో ప్రజాస్వామిక స్ఫూర్తితో వ్యవహరించి జగన్‌కు ఆ పదవి ఇచ్చే అవకాశం మాత్రం ఎప్పటికీ ఉండకపోవచ్చు.

11 Replies to “ఈ విషయంలో మాత్రం నిబంధనలు చూపించరు!”

  1. సర్లే కాని ప్రతిపక్ష నేత హోదా లేకపోతే MLA విధులు నిర్వహించకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడ ఉందొ వెళ్లి అడగకూడదు

  2. 2014-24 వరకు లోక్సభ లో కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారా?

  3. emito manam rule chesinappudu matram opposition rights evvali ante constitution lo rasunda ani adugudham, mana deggariki vachesariki …

  4. వాళ్ళు ట్రాప్ చేశారు.. నీ జగన్ రెడ్డి గుడ్డిగా ఆ ట్రాప్ లో పడ్డాడు..

    ప్రతిపక్ష హోదా కోసం యుద్ధం చేస్తూ .. జనాలకు విసుగు తెప్పిస్తున్నాడు..

    ఆ హోదా ఇవ్వడం.. ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టం..

    నువ్వు అడిగావు.. వాళ్ళు కాదన్నారు.. పైగా మీ జగన్ రెడ్డి గతం లో ఊగిపోతూ అన్న మాటలు కూడా జనాలకు గుర్తే.. గుర్తు లేకపోయినా వాళ్ళు పదే పదే గుర్తు చేస్తుంటారు..

    ..

    టోటల్ ఎపిసోడ్ లో బకరా అయింది మాత్రం జగన్ రెడ్డే..

    ఒక సీఎం గా పని చేసిన వ్యక్తి.. ఒక తొక్కలో ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు ఇంత రాద్ధాంతం ..

    అసెంబ్లీ కి రాకుండా తప్పించుకోడానికి.. సాకులు వెతుక్కొంటున్నాడు.. అని జనాలు అనుకొంటున్నారు..

    ..

    ఇప్పుడు ఫైనల్ గా 2029 లో ఈ జగన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా ఇస్తే చాలు.. సంతోషపడిపోతాడు.. అని జనాలు అనుకొంటే…

    ఇప్పుడొచ్చిన 11 కి ఇంకో ఏడుగురిని కలిపేసి.. భారీగా ముష్టి వేస్తారు..

    ..

    పైగా.. జనాలు ఎవరికీ “నిబంధనలు” చూపించాల్సిన పని లేదు..

    1. 2014-2019 ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు మైక్ ఇవ్వడం లేదని అసెంబ్లీ కి వెళ్ళకుండా పాదయాత్ర చేసాడు..

      2024-2029 ప్రతిపక్ష హోదా కావాలి అని అసెంబ్లీ కి వెళ్ళకుండా పాదయాత్ర చేస్తే సరిపోతుంది కదా..

  5. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఓదార్పు యాత్ర చెయ్యడమే జగన్ గారికి ఇవ్వనందుకు ఆ వూళ్ళో ఇంతమంది చచ్చేరు ఈ వూళ్ళో ఇంతమంది చచ్చేరు అని ఓదార్పు యాత్రలు చేయడమే దీనికి మన పార్టీ కి ఎలాగూ శవాల పార్టీ అని పేరుకదా ఆ ప్రకారం గ చూసిన సెంటిమెంట్ కలసివస్తుంది

Comments are closed.