స్వ‌ర్ణాంధ్ర‌@2047

ఏపీ అభివృద్ధి కోసం స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కోరారు. ఇందుకోసం ప్ర‌త్యేక పోర్ట‌ల్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు సోష‌ల్ మీడియాలో ఒక…

ఏపీ అభివృద్ధి కోసం స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కోరారు. ఇందుకోసం ప్ర‌త్యేక పోర్ట‌ల్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు సోష‌ల్ మీడియాలో ఒక పోస్టు పెట్ట‌డం విశేషం.

స్వ‌ర్ణాంధ్ర‌@2047 అనే పోర్ట‌ల్‌ను ఏర్పాటు చేశామ‌ని, స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని సీఎం కోరారు. ఈ పోర్ట‌ల్‌ను ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక విభాగం ప్రారంభించింది. పోర్ట‌ల్‌కు మంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు అంద‌జేసిన వారికి అభినంద‌న స‌ర్టిఫికెట్ అంద‌జేయ‌నున్నారు.

చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఇలాంటి నినాదంతో ముందుకు వ‌స్తుంటారు. గ‌తంలో విజ‌న్‌-2020 అని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. కానీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్ర‌మే. మ‌రీ ముఖ్యంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌నకు గురైంది. ఏపీ పాల‌కుల తెలంగాణ ప్రాంత ప్ర‌జా వ్య‌తిరేక విధానాల వ‌ల్లే రాష్ట్ర విభ‌జ‌న‌కు దారి తీసింద‌ని ఆ ప్రాంత నాయ‌కులు, ప్ర‌జ‌లు బ‌లంగా ప్ర‌చారం చేశారు.

చంద్ర‌బాబు క‌నీసం తెలంగాణ‌లో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా చేప‌ట్ట‌లేద‌నే విమ‌ర్శ వుంది. ఇవ‌న్నీ తెలంగాణ విభ‌జ‌న‌కు దారి తీశాయ‌ని చెప్పొచ్చు. తాజాగా 2047 నినాదంతో చంద్ర‌బాబు ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం. నినాదం ఏదైనా రాష్ట్రానికి మంచి జ‌రగాల‌ని ప్ర‌జానీకం కోరుకుంటోంది. ప్ర‌భుత్వం ఇచ్చిన పోర్ట‌ల్‌కు ఎవ‌రైనా స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వొచ్చు.

9 Replies to “స్వ‌ర్ణాంధ్ర‌@2047”

  1. చంబా కట్టలేదు సరే మన మహా నేత జల యజ్ఞం పేరు తో కట్టించి సంక్షేమం అభివృద్ధి జోడెద్దుబండి లాగా నడిపించిన కానీ రాష్ట్రము విభజింప పడింది కదా…..రాష్ట్ర విభజన కి మూలం నేత ల స్వార్థం అంతే

  2. అవునా? అందుకే విడిపోయిందా? మరైతే ఇపుడు సాగునీటి ప్రాజెక్ట్ చేపట్టి, సుఖం గా ఉన్నారా తెలంగాణా వారు? అంటారు, కెసిఆర్ కట్టిన ప్రాజెక్టులు సర్వ నాశనం అయ్యిందని. కానీ సీబీఎన్ కు చేసిన ఐటీ గానీ చాలా ప్రాజెక్టులు తెలంగాణ లో మంచి పేరే ఉంది. దుష్టులకు కనపడదులే.

Comments are closed.