ఇక పెద్ద సినిమాలది ఇదే దారి

తొలి రోజు దేవర యూనిట్ దగ్గర దగ్గర 20 కోట్ల షేర్ చూపించింది ఒక్క నైజాంలో. అంటే ఈ లెక్కన మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోవాలి.

ఏపీలో 55 కోట్ల మేరకు విక్రయాలు, నైజాంలో 45 కోట్లు, సీడెడ్ 24 కోట్లు, ఇవీ దేవర సినిమా అమ్మకాలు. ఇంత రేటా అనుకున్నారు. కానీ ఏపీలో ప్రభుత్వం భారీగా రేట్ల పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. స్పెషల్ షో లు, స్పెషల్ రేట్లు. ఇక నైజాంలో కొత్త పద్దతి కనుగొన్నారు. థియేటర్ కు థియేటర్ వంతున టికెట్ లు తీసుకుని, కావాల్సిన వారికి స్పెషల్ రేటున ఇచ్చేయడం. టికెట్ వెయ్యి నుంచి రెండు వేలు. డైరక్టర్లతో, హీరోలతో, బయ్యర్ తో వున్న అబ్లిగేషన్ మేరకు చాలా మంది నిర్మాతలు లక్షలు ఖర్చు చేసి ఒక్కో షో తీసుకున్నారు. తమ వాళ్లకు పంచుకున్నారు. ఎలాగైతేనేం మొత్తం మీద ఒక్క టికెట్ డబ్బులకు బదులు రెండు నుంచి నాలుగు టికెట్ డబ్బులు ఒకేసారి తీసుకున్నట్లు అయింది.

అలవైకుంఠపురములో 42 కోట్లు నైజాంలో చేస్తే, గుంటూరు కారం అదే రేటుకు ఇచ్చారు. కానీ చాలా అంటే చాలా నష్టం వచ్చింది. గుంటూరు కారం టైమ్ లో కూడా ఈ స్పెషల్ షో అన్నది కొంత ట్రయ్ చేసారు. దేవర టైమ్ లో బాగా వర్కవుట్ అయింది. తొలి రోజు దేవర యూనిట్ దగ్గర దగ్గర 20 కోట్ల షేర్ చూపించింది ఒక్క నైజాంలో. అంటే ఈ లెక్కన మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోవాలి.

నైజాంలో ఒక థియేటర్ చెయిన్ తమ థియేటర్ల తరపున 15 కోట్ల అడ్వాన్స్ లు ఇచ్చింది. ఈ లెక్కన తొలి రోజు అ థియేటర్ చెయిన్ కు 6 నుంచి 7 కోట్ల మధ్య వెనక్కు వచ్చేసి వుండాలి. మరో రెండు రోజుల్లో రికవరీ అనుకోవాలి.

అందువల్ల ఇక రాబోయే ఓ మాదిరి భారీ సినిమాలకు నైజాంలో 45 కోట్లు అన్నది మినిమమ్ రేటు అవుతుంది. అంతకన్నా భారీ సినిమాలకు 60 నుంచి 70 కోట్లు రేటు అవుతుంది. అదే విధంగా ఏపీలో ఇక నుంచి రేట్లకు, షో లకు సమస్య వుండదు కనుక 55 నుంచి 90 కోట్ల మేరకు అమ్మకాలు వుండొచ్చు.

టాలీవుడ్ వెలిగిపోతోంది.

4 Replies to “ఇక పెద్ద సినిమాలది ఇదే దారి”

  1. I heard that film team has decided to Fake collections. Film choosina neutral audience opinion on day-1, they are saying, film has zero content and no story, its only fights and elevations.

Comments are closed.