రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోతే జగన్ వల్ల రావడం లేదు… వస్తే చంద్రబాబు వలన వచ్చాయి అంటూ సరికొత్త రగం ఎత్తుకుంటున్నారు టీడీపీ మరియు దాని అనుకూల మీడియా. ఏ ఒక కంపెనీ కొత్తగా వచ్చిన గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వలన వచ్చాయంటూ మాట్లాడుతున్నా టీడీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.
పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు, లోకేష్ లు ఓర్వలేక ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లడుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు అండ్ కో అభివృద్ధిని అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ ఒక డ్రామా కంపెనీ అని అభివర్ణించారు.
గతంలో నేపాల్ గుర్ఖాలకు సూటూ బూటూ తగిలించి ఎంవోయూలు చేసిన చంద్రబాబు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒక వైపు తాము అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారంటూ మండిపడ్డారు. లోకేష్ ఏదో వారం రోజులో రాష్ట్రంలో జరిగిన పెద్ద కుంభకోణం బయట పెడుతా అంటున్నారు, కుంభకోణలు జరిగింటే బయట పెడతారు, లేకనే స్కిప్ట్ కోసం వారం రోజులు సమయం తీసుకొని డ్రామాలు అడుతున్నారని ఆరోపించారు.
నిజంగా లోకేష్ చెప్పినట్లు ఏదైనా కుంభకోణం ఉంటే తక్షణమే బయటపెట్టవచ్చు కాదా రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు. టైం తీసుకోని, స్కిప్ట్ రేడి చేసుకొని వచ్చి, రాని మాటలతో కామోడీలు చేయడం తప్పా లోకేష్ లో సీరియస్ నెస్ కనపడటం లేదని సోంత పార్టీ నాయకులే అనుకుంటున్నారు.