తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ప్రతేక్య పంథాలో నడుస్తుంటాయి. వారు ఎప్పుడు కేంద్రంతో ఉప్పు-నిప్పుగా ఉంటారు. ఏ పార్టీ అయిన కేంద్రంతో సస్సంబంధాలు ఉంటే ఎక్కడ రాష్ట్రంలో ప్రజలు వ్యతిరేకంగ అవుతారనే భావనతో కేంద్రంతో రాజకీయాలు గుట్టుగా చేస్తుంటారు.
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నా సందర్బంగా ఒక సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంతో తాను ఎలాంటి రాజీ పడబోనని ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నరు సీఎం స్టాలిన్.
తన షెడ్యూల్లో ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడిన సీఎం స్టాలిన్, నేను కేవలం చేతులు కట్టుకుని వినడానికి అక్కడికి వెళ్లడం లేదని వ్యంగ్యంగా అన్నారు. “నేను కావడి తీసుకుని ఢిల్లీ వెళ్తున్నానని అనుకుంటున్నారా? చేతులు జోడించి చెప్పేది వినడానికి నేను అక్కడికి వెళ్తున్నానని మీరు అనుకుంటున్నారా? నేను కలైంజ్ఞర్ కుమారుడిని’’ అని సీఎం స్టాలిన్ అన్నారు.
“ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) దాని విధానాలపై ఎల్లప్పుడూ బలంగా ఉంటుందంటూ పునర్ఘటించారు.. తిరుమావళన్ చెప్పినట్లుగా డీఎంకే ఎప్పటికి రాజీపడదు’’ అంటూ సీఎం స్టాలిన్ తెలిపారు.