కామాంధుడి చేతిలో మూడేళ్ల బాలిక‌.. ఎంత దారుణం!

తిరుప‌తి జిల్లా వ‌డ‌మాల‌పేట మండ‌లంలో కామాంధుడి చేతిలో మూడేళ్ల బాలిక బ‌లి అయ్యింది. ఏపీలో చిన్నారులు, మ‌హిళ‌ల‌పై వ‌రుస అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజుల‌కో అఘాయిత్యం జ‌రుగుతోంది. Advertisement…

తిరుప‌తి జిల్లా వ‌డ‌మాల‌పేట మండ‌లంలో కామాంధుడి చేతిలో మూడేళ్ల బాలిక బ‌లి అయ్యింది. ఏపీలో చిన్నారులు, మ‌హిళ‌ల‌పై వ‌రుస అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజుల‌కో అఘాయిత్యం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో వ‌డ‌మాల‌పేట‌లో చిన్నారి అదృశ్యం విషాదాంత‌మైంది. చిన్నారిని ఎత్తుకెళ్లిన వాడే హ‌త్యాచారానికి పాల్ప‌డిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. పోలీసుల క‌థ‌నం మేర‌కు …వ‌డ‌మాల‌పేట మండ‌లంలోని ఏఎం పురానికి చెందిన చిన్నారికి చాక్లెట్లు ఇస్తాన‌ని నాగ‌రాజు అలియాస్ సుశాంత్ అనే యువ‌కుడు తీసుకెళ్లాడు.

బిడ్డ క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంట‌నే చిన్నారి అదృశ్యం మిస్ట‌రీని ఛేదించారు. పాప‌పై హ‌త్యాచారానికి పాల్ప‌డి, పూడ్చిపెట్టిన‌ట్టు గుర్తించారు. చిన్నారి మృత‌దేహాన్ని బ‌య‌టికి తీసి, పోస్టుమార్టం అనంత‌రం త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. ఈ దుర్ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబునాయుడు సీరియ‌స్‌గా స్పందించారు.

బాధిత చిన్నారి కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు అంద‌జేయాల‌ని తిరుప‌తి క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్‌ను సీఎం ఆదేశించారు. హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆదివారం బాధిత బాలిక కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి, చెక్‌ను అంద‌జేయ‌నున్నారు. మూడున్న‌రేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్ప‌డ‌డంపై తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కామాంధుడిని క‌ఠినంగా శిక్షించాల‌నే డిమాండ్ వెల్లువెత్తుతోంది.

14 Replies to “కామాంధుడి చేతిలో మూడేళ్ల బాలిక‌.. ఎంత దారుణం!”

  1. జగ*న్ టైంలో తమ డబ్బు కోసం అందరికీ గంజా*యి కి అలవాటై చేసారు. దాని ఫలి*తం ఒక రెండు తరాల పా*టు వుంటది.

    ఇప్పుడు సమాజం ఆ దుష్పలితం చూస్తున్నారు

    జగ*న్ కి మాత్రం మ*ద్యం, గంజా*యి ద్వారా ల*క్షల కో*ట్లు సంపాదించి ప్యా*లస్ లో, విమానాల్లో తిరు*గుతూ సుఖంగా వున్నాడు.

    ప్రజ*ల మాత్రం చం*క నాకిపో*యారు

    ఒక రాక్షసు*డు నీ అధి*కారం ఇస్తే ఇలానే వుంటది ఫలితము.

  2. పసిపిల్లల మీద ఇటువంటి అఘాయిత్యాలు చేసేవాళ్లను మామూలు శిక్షలతో సరిపెట్టకూడదు వాళ్ళ శరీరభాగాలు అమ్మేసి బాధిత కుటుంబానికి ఇచ్చేయాలి

  3. చేతిలో ఇంటర్నెట్ వున్న ఫోన్,

    అందులో ప్రభుత్వ, పేరెంట్స్ అదుపు లో లేని అశ్లీల కెంటెంట్

    పరిణితి చెందని మనస్సు, వయస్సు..

    ఇంట్లో టీవీలో , బయట కవ్వించే రెచ్చగొట్టే విషయాలు..

    అలాంటి వాటిని చిన్న పసి పాప లకి సినిమాలో నీ ఉదేకపరిచే డ్రెస్ లు వేసి స్టెప్ లతో పండుగ రోజు అందరూ టీవీ లో చూస్తూ ఫ్యామిలీ తో పెద్దవాళ్ళు కూడా చప్పట్లు కొట్టడం..

    కనుక అవి తప్పు కాదు అని చెప్పకనే చెప్పడం.

    కవిచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి..

    ఒక కుర్రాడు అదుపు తప్పడనికి ఇంకా ఏమో కావాలి.

Comments are closed.