నానీని సైకోగా అభివ‌ర్ణించిన చిన్ని

త‌నపై నాని చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎక్స్ వేదిక‌గా చిన్ని ఘాటైన స‌మాధానం ఇచ్చారు

కేశినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా వార్ న‌డుస్తోంది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో గానీ, ప‌ర‌స్ప‌రం తీవ్రంగా ద్వేషించుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో త‌మ్ముడైన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ నాని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. కౌంట‌ర్‌గా స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదంటూనే, త‌న అన్న‌ను సైకోగా అభివ‌ర్ణించ‌డం గ‌మ‌నార్హం.

విశాఖ‌లో ఉర్సా క్ల‌స్ట‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వేల‌కోట్ల విలువ చేసే భూమిని త‌క్కువ ధ‌ర‌కు క‌ట్ట‌బెట్ట‌డంపై వివాదం త‌లెత్తింది. దీని వెనుక విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్న‌ట్టు నాని ఆరోప‌ణ‌. ఆ సంస్థ డైరెక్ట‌ర్ స‌తీష్‌కు విజ‌య‌వాడ ఎంపీ సిఫార్సు చేయ‌డంతోనే ఇదంతా జ‌రిగింద‌ని నాని మండిప‌డ్డారు.

ఆ సంస్థ‌కు భూకేటాయింపు వెనుక ఎంపీ త‌న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించార‌ని నాని ఆరోపించారు. అలాగే సీఎంతో పాటు ఆయ‌న కుమారుడు లోకేశ్ పేరును వాడుకుంటున్నాడ‌ని కూడా ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కేశినేని చిన్నిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు.

త‌నపై నాని చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎక్స్ వేదిక‌గా చిన్ని ఘాటైన స‌మాధానం ఇచ్చారు. అదేంటంటే…

“ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక. సోషల్ మీడియా రోడ్ల మీద మతి భ్ర‌మించి తిరుగుతున్న సైకో… చిప్పు దొబ్బి సోషల్ వాల్స్ పై కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నాడు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నాడు. స్పందించాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండండి” అని ఎంపీగా కేశినేని చిన్ని విజ్ఞ‌ప్తి చేయ‌డం గ‌మ‌నార్హం.

కేశినేని చిన్ని స్పంద‌న చాలా ఘాటుగా వుంది. మ‌తిభ్రమించి సోష‌ల్ మీడియా రోడ్ల‌పై సైకో తిరుగుతున్నాడ‌ని, అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని జిల్లా ప్ర‌జ‌ల‌కు పిలుపు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. కేశినేని నాని ఊరికే అంటార‌ని అనుకోలేం. ఎలా రియాక్ట్ అవుతారో అనే ఉత్కంఠ నెల‌కుంది.

11 Replies to “నానీని సైకోగా అభివ‌ర్ణించిన చిన్ని”

    1. mara velli mee pichhina koduku Balayya wife vangoni undi anta bellam konda deggara velli vadi karchindi nevvu naki ballaya gadi runam tirchuko..

  1. ఏరా నాని? ముచ్చటగా మూడో సారి ఎంపీ అయ్యి..వీలైతే సెంట్రల్  మినిస్టర్ కూడా అయ్యేవాడివి.నీ గు.. బలుబు అహంకార పూరిత మాటలు,ప్రవర్తన తినే ప్లేట్ ని తన్నేసుకున్నావ్.. నీ మాటలు ఎవుడ్రా లెక్కపెట్టేది?

Comments are closed.