వైసీపీలో ‘ధ‌ర్మ’ సంక‌టం!

త‌న‌కు థ్రెట్ వుంద‌ని, ఏదైనా స‌మాచారం కావాలంటే పంపుతాన‌ని ధ‌ర్మారెడ్డి స‌మాధానం ఇచ్చార‌ట‌

వైసీపీలో “ధ‌ర్మ” సంక‌టం ఏర్ప‌డింది. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు పే…ద్ద కొండ‌ను వేశారు. రాజ‌కీయంగా లాభ‌న‌ష్టాలు ఎవ‌రికి అనేది ప‌క్క‌న పెడితే, కోట్లాది మంది హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌న్న‌ది నిజం. తిలా పాపం త‌లా పిడికెడు అనే సామెత చందంగా… అత్యంత ప‌విత్రంగా భావించే తిరుమ‌ల ప్ర‌సాదంపై అనుమాన బీజాలు వేయ‌డంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల బాధ్య‌త వుంది.

తిరుమ‌ల ప్ర‌సాదంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్ప‌టికీ, ఐదేళ్ల పాటు కొండ‌పై ఇన్‌చార్జ్ ఈవోగా అన్నీ తానై అధికార చ‌క్రాన్ని తిప్పిన ధ‌ర్మారెడ్డి ఇంత వ‌ర‌కూ నోరు మెద‌ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ధ‌ర్మారెడ్డి వైఖ‌రి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. మ‌రీ ముఖ్యంగా ధ‌ర్మారెడ్డిపై వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ర‌గిలిపోతున్నారు. ఇలాంటి అవ‌కాశ‌వాది, స్వార్థ‌ప‌రుడికి త‌మ నాయ‌కుడు స్వామి వారి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని వైఎస్ జ‌గ‌న్‌పై కూడా వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.

ధ‌ర్మారెడ్డిని ప‌క్క‌న పెడితే, క‌నీసం మీరైనా మాట్లాడాల‌ని టీటీడీ మాజీ ఈవో, మాజీ సీఎస్ అజ‌య్ క‌ల్లంను వైసీపీ పెద్ద‌లు కోరిన‌ట్టు తెలిసింది. అందుకు ఆయ‌న నిరాక‌రించిన‌ట్టు స‌మాచారం. ధ‌ర్మారెడ్డితో మాట్లాడించుకోవాల‌ని ఆయ‌న సూచించిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో అజ‌య్ క‌ల్లం త‌న సిఫార్సు లేఖ‌ను పంపితే, ధ‌ర్మారెడ్డి క‌నీస మ‌ర్యాద లేకుండా తిర‌స్క‌రించార‌నే కోపం అజ‌య్ క‌ల్లంలో ఉంద‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో కేబినెట్ హోదాలో ఉన్న సిఫార్సు లేఖ‌ను తిర‌స్క‌రించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించిన త‌ర్వాత ఆ రోజుకు ఎలాగోలా ఓకే చేసిన‌ట్టు తెలిసింది. అప్ప‌టి నుంచి ఏనాడూ అజ‌య్ క‌ల్లం తిరుమ‌ల‌కు సంబంధించి సిఫార్సు లేఖ‌లు ఇవ్వ‌లేద‌ని స‌మాచారం.

మ‌రో ప్ర‌ముఖ మాజీ అధికారి, ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అధికారిగా గుర్తింపు పొందిన ఉన్న‌తాధికారి సైతం ఇదే రీతిలో స్పందించిన‌ట్టు తెలిసింది. ఒక సంద‌ర్భంలో స‌ద‌రు మాజీ ఉన్న‌తాధికారి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ధ‌ర్మారెడ్డి అతి చేష్ట‌ల‌పై సున్నితంగా ఫిర్యాదు చేశార‌ని తెలిసింది. అన్నీ ధ‌ర్మారెడ్డ‌న్న‌ చూసుకుంటార్లే అన్నా అని స‌మాధానం ఇవ్వ‌డంతో, మ‌న‌కెందుకులే అని అప్ప‌టి నుంచి ఆ ఉన్న‌తాధికారి మౌనాన్ని ఆశ్ర‌యించార‌ని స‌మాచారం. తాజాగా తిరుమ‌ల ప్ర‌సాదంపై వివాదం త‌లెత్త‌డంతో మాట్లాడాల‌ని వైసీపీ పెద్ద‌లు కోర‌గా, అన్నీ ధ‌ర్మారెడ్డి చూసుకుంటార్లే అని స‌మాధానం ఇచ్చిన‌ట్టు తెలిసింది.

ఇటీవ‌ల జ‌గ‌న్‌కు స‌న్నిహితుడైన ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా వైసీపీ నాయ‌కుడొక‌రు ధ‌ర్మారెడ్డికి ఫోన్ చేసి, ఈ స‌మ‌యంలో మీరు మాట్లాడ‌క‌పోతే ఎట్ల‌న్నా? అని నిల‌దీసిన‌ట్టు స‌మాచారం. త‌న‌కు థ్రెట్ వుంద‌ని, ఏదైనా స‌మాచారం కావాలంటే పంపుతాన‌ని ధ‌ర్మారెడ్డి స‌మాధానం ఇచ్చార‌ట‌! దీంతో వైసీపీ ధ‌ర్మ సంక‌టంలో ప‌డినంత ప‌నైంది.

ఇలాగైతే కాద‌ని, రాజ‌కీయంగా తామే తేల్చుకోవాల‌ని జ‌గ‌న్ మొద‌లుకుని, ఆ త‌ర్వాత స్థానాల్లోని నాయ‌కులు ముందుకొస్తున్నారు. తాజాగా ప్ర‌తి జిల్లాలోనూ నాయ‌కులు మీడియా ముందుకొచ్చి వాస్త‌వాలు చెప్పేలా వైసీపీ అగ్ర నాయ‌కులు దిశానిర్దేశం చేయ‌డం గ‌మ‌నార్హం. ధ‌ర్మారెడ్డి విష‌యంలో మాత్రం వైసీపీ నాయ‌కులంతా తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు.

32 Replies to “వైసీపీలో ‘ధ‌ర్మ’ సంక‌టం!”

  1. అలాగే మొన్నటికి మొన్న పెద్దిరెడ్డి గురించి ఫిర్యాది చేస్తే ఆ ఫిర్యాదుదారుల గురించి పెద్దిరెడ్డి వద్దనే ప్రస్తావించలేదూ? ఆపత్కాలంలో వారిలో అలాగే ముఖం చాటేస్తారు.

  2. నిజానికి Y.-.C.-.P నె ఈయనని మాట్లాడవద్దు అని చెప్పినట్ట్లు ఉంది. జనం లొ ఈయన మీద ఎంత వ్యతిరెకత ఉందొ అందరికీ తెలిసిందె.

  3. ఒక విధంగా.. ధర్మా రెడ్డి మాట్లాడక పోవడమే మంచిది…. తప్పు చేసిన / జరిగిన తర్వత ఎంత త్వరగా ఒప్పుకొని…ఎక్కడ , ఎలా జరిగింది కనుక్కొంటాము అంటే… డ్యామేజ్ కవర్ అవుతుంది..

    అంతే కానీ.. తప్పని ఎంత దాయాలనుకొంటే అంత ఎక్కువగా చినుగుతుంది…

    గొప్ప వాళ్ళు/ ఉత్తములు: తాము తప్పులు చేయకుండా…పక్క వాళ్ళు చేసే తప్పులు చూసి అవి చెయ్యకుండా ఎలా వుండాలో నేర్చుకుంటారు..

    సామాన్యులు:: తాము చేసిన తప్పులనుంచి నేర్చుకొని మళ్ళా తిరిగి చేయకుండా వుంటారు..

    అధములు/ చెద్దవాళ్ళు:: పక్క వాడు చేసే తప్పులు, ఎత్తి చూపుతూ.. అది వాళ్ళు చేస్తే ఒప్పని, వాళ్ళు చేసేవి తప్పులని తెలిసిన అవి ఒప్పులని వితండ వాదం చేస్తారు…

    ధర్మా రెడ్డి ని అధర్మంగా నే అక్కడ అధికారం చేలాయించాడు… అందుకు తగ్గ శాస్తి ఆల్రెడీ జరిగింది…

    ఇంక మిగిలిన వాళ్ళకి కూడా జరగాలి/ జరుగుతుంది..

    తప్పు చేయక పోయినా…తప్పు చేసే / చేసిన వాళ్ళని సమర్ధించినా అది తప్పు కిందే లెక్క…

  4. 😂😂😂…..పరిపాలన చేతగాక పోతే వచ్చే నష్టాలు GA ఇవన్నీ…..ఇంకా ఇప్పటికీ కూడా తప్పులను వొప్పుకోకుండా, తప్పు చేసిన వాడికి SUPPORT చేస్తున్నాడు….మీరు కూడా గొర్రెల్లా సపోర్ట్ చేస్తూ అన్నయ్య POLITICAL CAREER కి END CARD వేస్తున్నారు…..అంతే…

  5. కల్తీ రెడ్డి జగన్ కు, కల్తీ స్వాములు, కల్తీ సలహాదారులు, కల్తీ కార్యకర్తలు … అన్నీ కల్తీ నే, ధర్మం ఎక్కడా? అన్నీ అధర్మమే జగన్ కు నచ్చుతాయి .

  6. నేయలో మిగిల్చిన డబ్బు ఎవడికి చేరిందో చేపల్సి వొస్తుంది అని గమ్మున ఉండి ఉంటాడు .. ఊరికినే ఎందుకు కేల్కుంటారు

  7. 2003 వెయ్యికాళ్ళ మండపం కూల్చాడు బాబు కొన్ని రోజులకే అలిపిరి ఘటన జగన్ చేసి ఉంటే అప్పుడే పోయే వాడు కాదు బాబు గాని కొడుకు లో ఒక్కరు మాత్రం పోతారు వచ్చే దసరా లోపల చూసుకోండి నా మెసేజ్ రాసిపెట్టుకోండి

      1. ఏముందిలో బ్రదర్.. ఈవీఎం గెలుపులే.. అదికూడా ఒక గెలుపా.. అదికూడా ముగ్గురు కలిసి…. ఒక ప్రముఖ సర్వే అతను ఒక నెల క్రితం పర్సనల్ గా చెప్పాడు … టీడీపీ కూటమి కి వచ్చింది 58 సీట్లు మాత్రమే అని….జగను బయటకి వస్తే చూస్తున్నాం గా..

  8. “స్వామి వారి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని వైఎస్ జ‌గ‌న్‌పై కూడా వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.”

    anyway Jagan can not read this article in telugu so what’s the point. are you trying to let barathi know?

  9. ప్రపంచంలో వై. స్. ఇంటిపేరు కలిగిన వాళ్లు ఆ ఒక్క కుటుంబంలో తప్ప, భూమి మీద ఇంకెక్కడా కనపడరు !

    ఎందుకలాగా అంటే.. సమాధానం చెప్పేవాడే లేడు .

    నిఖార్సయిన రె డ్లే.. అతను రె డ్డి కాదు అని చెప్పినా.. జ ఫ్ఫా రె డ్లు ( GA) అతన్ని మోస్తూ.. రె డ్ల పరువు బజారుకీడుస్తున్నారు .

    బై రె డ్డి ఇంటిపేరుతో సీమలో కొన్ని వందల కుటుంబాల వారు ఉన్నారు.

    అంతెందుకు మా ఇంటిపేరుతో కూడా కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి .

    కానీ ఆ ఇంటిపేరు..ఆ రాజా రె డ్డి, అతని ఇద్దరి భార్యల సంతానానికి తప్పించి.. ఇంకెవరికీ లేదు ఆఖరికి సీమలో కూడా . ఎందుకంటారు ?

  10. మౌనం అంగీకారమే. కలిపించినోనికి తెలియకుండా ఉంటాడా? ఎక్కడున్నాడో తెల్సితే, రాళ్లు విసురుతారు. దాక్కోనివ్వు. బ్రతికిపోతాడు.

  11. మారీచుడుకు రామబాణం దెబ్బ ఎలాగా ఉంటుందో రుచి చూసిన తర్వాత రావణుడు తిరిగి మల్లి వెళ్లి సీతను తీసుకు రమ్మంటే హడలి పోయాడు చంపేస్తాన్నంటేనే వెళ్ళాడు చచ్చేడు ఇక్కడ సర్ వెంకన్న దెబ్బ ఎలాగుంటుందో చూసేడు కిక్కురు మంటం లేదు

  12. సై కో గ్యాంగ్ అరాచకం లో సాక్షాత్ కలియుగ వేంకటపతి నీ వదలలేదు. సై కో గాడు బాబు గుడిని మింగితే, విడు గుడిని గుడిలో ఉన్న లింగాన్ని మింగేశాడు.. మహా మేత నూరు గుడులు తిన్న రాబందు గాలి వాణకు చచ్చింది, విడు ఏల పోతాడో !

Comments are closed.