కర్నూలులో మరో 30 కొత్త కరోనా కేసులు

కర్నూలును కరోనా వణికిస్తూనే ఉంది. తాజాగా మరో 30 కేసులు ఈ జిల్లా నుంచి బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58 కొత్త కేసులు బయటపడగా, అందులో 30 కేసులు ఒక్క కర్నూలులోనే…

కర్నూలును కరోనా వణికిస్తూనే ఉంది. తాజాగా మరో 30 కేసులు ఈ జిల్లా నుంచి బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58 కొత్త కేసులు బయటపడగా, అందులో 30 కేసులు ఒక్క కర్నూలులోనే ఉన్నాయి. తాజా లెక్కలతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1583కు చేరింది.

నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు మొత్తంగా 6534 శాంపిల్స్ ను పరీక్షించగా, అందులో 58 మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు నిర్థారించారు. కొత్తగా లెక్కతేలిన కేసుల్లో అనంతపురం నుంచి 7, చిత్తూరు-నెల్లూరు నుంచి చెరొకటి, గుంటూరు నుంచి 11, కృష్ణా నుంచి 8 ఉన్నాయి.

గడిచిన 3 రోజులుగా గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే.. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య తగ్గి, కోలుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదు. అటు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మాత్రం 488కు చేరింది. రేపటికి ఈ మార్క్ 500 దాటుతుందని అంచనా.

మరోవైపు శ్రీకాకుళం, విశాఖపట్నంలో కొత్తగా ఎలాంటి పాజిటివ్స్ నమోదుకాకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1062 మంది యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

జగన్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన నవీన్ పట్నాయక్